నల్గొండ

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు/నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: మండలంలోని చల్మేడ గ్రామంలో వివాహిత గంగుల మంజుల(20) శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన గంగుల నర్సింహ్మ యాదవ్, కళమ్మల ఏకైక కుమార్తె మంజులను రెండున్నర ఏళ్ల క్రితం మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్‌తో వివాహాం జరిపించారు. మల్లేష్-మంజూల దంపతులకు 14నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కట్నం కోసం తరుచూ గొడవలు జరుగుతున్నాయని, శుక్రవారం కూడ గొడవ జరిగిందని తమ తల్లిదండ్రులకు కూతురు మంజుల తెలిపింది. ఇది జరిగిన కొద్ధిసేపటికే మంజుల పురుగుల మందు తాగిందని, మునుగోడు నుండి నల్లగొండ ఆసుపత్రికి తరలిస్తున్నామని ప్రాణాపాయ స్థితిలో ఉందని తల్లిదండ్రులకు మంజుల అత్తా వారింటి నుండి ఫోన్ సమాచారం అందింది. విషయం తెలుసుకున్న మంజుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వెంటనే బయలుదేరి మార్గమధ్యలో కంచనపల్లి వద్ద ఆసుపత్రికి తరలిస్తున్న మంజుల మృతదేహం వాహనాన్ని అడ్డగించి చూశారు. అప్పటికే మంజుల మృతి చెందడంతో అప్పాజీపేట గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోని మృతదేహంతో మునుగోడు మండలం చల్మెడకు వెళ్లి అత్తింటి ముందు ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో మునుగోడు పోలీసులు అదుపు చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని, వరకట్న వేధింపులే తమ బిడ్డను చంపాయని తెల్పడంతో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ, ఎస్‌ఐలు హామీలిచ్చారు. మంజుల తండ్రి నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐ ఇఫ్తెకర్ ఆహ్మద్‌లు తెలిపారు. కాగా మృతురాలి భర్త మల్లేష్, అత్త, ఇతర కుటుంబీకులు పోలీసుల అదుపులో ఉన్నారు.