నల్గొండ

సమానత సాధనకు కామన్ స్కూల్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 10: సమాజ అసమానతల నిర్మూలన దిశగా అందరికి ఒకే విద్య లక్ష్య సాధనకు కామన్ స్కూల్ విద్యావిధానమే మార్గమని అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు నల్లగొండ శివాంజనేయ పంక్షన్ హాల్‌లో జరుగనున్న డిటిఎఫ్ రాష్ట్ర మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభయమ్యాయి. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్‌ర్డెలు జాతీయ పతాకావిష్కరణ చేసి సభలను ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుండి ఉపాధ్యాయ ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. కామన్ స్కూల్ విద్యా విధానం-వ్యాపారీకరణకాదు..కాషారుూకరణ కాదు నినాదంతో సాగుతున్న ఈ మహాసభలలో అనిల్ సద్గోగోపాల్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్ధిక సరళీకరణ నేపధ్యంలో విద్యారంగం కార్పోరేట్, ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్లి వ్యాపార మయంగా మారి ప్రభుత్వ విద్య బలహీన పడిందన్నారు. సమాజంలోని ఉన్నత, మధ్యతరగతి, పేద వర్గాల వారిగా కార్పోరేట్, ప్రైవేటు, ప్రభుత్వ బడులు సాగుతున్న తీరుతో సమాజంలో అంతరాలు, అసమానతలు పెరిగిపోతుండటం ఆందోళకరమన్నారు. విద్యాహక్కు చట్టం నామమాత్రంగా మారిపోగా విశ్వవిద్యాలయాలు సైతం ప్రైవేటు ఆధీనంలోకి వెలుతున్నాయన్నారు. కెజి టూ పిజి వరకు కామన్ స్కూల్ విద్యావిధానం సాగితేనే సమాజంలో అందరికి ఒకే విద్య అందించడం ద్వారా అందరికి సమానా అవకాశాలు అందించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ప్రజాబాహుళ్యంలోకి కామన్ స్కూల్ విధానాన్ని తీసుకెళ్లి అమలుకు ప్రభుత్వాలపై ప్రజల నుండి ఒత్తిడి తెచ్చేలా డిటిఎఫ్ విద్యావైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు ఉపకరించాలన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతు విద్యారంగం అభివృద్దికి విద్యావిధానంలో సమూల మార్పులు సంస్కరణలు అనివార్యమన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాల్సివుందన్నారు. బాలిక విద్యా అభివృద్ధికి దృష్టి సారించాలన్నారు. మధ్యాహ్నా భోజనంతో పాటు వేలకోట్లు ఖర్చు చేస్తున్నా మెరుగైన విద్య అందరికి అందడం లేదన్నారు. ఉపాధ్యాయులు వృత్తినిబద్ధతో సామాజిక బాధ్యతతో పనిచేసి మెరుగైన విద్యా బోధనకు కృషి చేయాలన్నారు. హక్కుల డిమాండ్‌కు ముందు విధుల సమర్ధ నిర్వాహణకు పాటుపడాలన్నారు. ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ సాధనకు తనవంతు కృషి చేస్తానాన్నరు. రాష్ట్ర లోటుబడ్జెట్ నేపధ్యంలో ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన ఇబ్బందికరమవుతుందన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతు విద్యారంగ సంస్కరణలకు డిటిఎఫ్ సాగిస్తున్న కృషికి తన మద్దతు ఉంటుందన్నారు. మూడు రోజు పాటు కామ్రేడ్ శేషు ప్రాంగణంలో అహ్వాన సంఘం అధ్యక్షుడు నోముల సత్యనారాయణ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహాసభల్లో డిటిఎఫ్ సావనీర్‌ను పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవచారి ఆవిష్కరించారు. డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్.కిష్టప్ప నివేదికను సమర్పించారు. సమావేశంలో అధ్యాపకజ్వాల సంపాదకులు ఎం.గంగాధర్, మాజీ అధ్యక్షుడు కె.నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సోమయ్య, వెంకట్రాములు, శంతన్, పద్మలత, కార్యదర్శులు శామ్యూల్, రాజిరెడ్డి, టి.లింగారెడ్డి, ఎన్.్భస్కర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు ఎం.దశరథరామారావు, లింగయ్య, భాస్కర్, సత్తయ్యలు పాల్గొన్నారు.
నేర రహిత జిల్లాగా సూర్యాపేట
* ఎస్పీ పరిమళ హనానూతన్
సూర్యాపేటటౌన్, డిసెంబర్ 10: సూర్యాపేట జిల్లాను నేరరహిత జిల్లాగా తయారుచేయాలని జిల్లా ఎస్పి పరిమళ హనానూతన్ అన్నారు. శనివారం స్థానిక ఎస్పి కార్యాలయంలో జిల్లాస్థాయి పోలీస్ అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరాలు పూర్తిగా అదుపులో ఉండేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ.500, రూ.1000నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద ప్రజలు బారులుతీరుతున్నారని, అలాగే ఎటిఎంల వద్ద కూడా భారీ క్యూలైన్‌లు ఉంటున్నాయన్నారు. దేశంలో ఏటిఎంలపై దాడులు వంటి సంఘటనలు జరుగుతున్నందున బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద అధనపు సిబ్బందిని నియమించి భద్రతను పెంచాలన్నారు. అలాగే స్నేహిత మోబైల్ టీమ్‌ల ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో కాని, పట్టణాల్లో కాని మైక్‌లు, ఎలాంటి పెద్ద శబ్దాలు వచ్చే పరికరాలను రాత్రి 10గంటల తర్వాత వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించే విధంగా, కార్లు నడిపే వారు సీట్‌బెల్ట్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.