నల్గొండ

కాలుష్యం ఆపాలి..ఉపాధి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 10: పరిశ్రమల యాజమాన్యాలు స్పందించకపోతే విద్యార్థులు, యువజనులు, ప్రజాప్రతినిధుల మద్దతుతో దశలవారిగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిలపక్ష నేత, ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం చౌటుప్పల్‌లో మహార్యాలీ నిర్వహించారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని, కాలుష్యాన్ని నివారించాలన్న నినాదాలు మార్మోగాయి. జాతీయ రహదారి విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లింది. ర్యాలీ అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన సభలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఉద్యమాలు సాగిస్తున్నా యాజమాన్యాలు స్పందించడంలేదన్నారు. కంపెనీలు వదులుతున్న కాలుష్యంతో పంట పొలాలు బీళ్లుగా మారాయన్నారు. అన్నదాతలు కూలీలుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా స్థానికేతరులతో పనులు చేయించుకుంటూ నిరుద్యోగ యువతీయువకులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానికుకలు 80 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి పరిశ్రమలో ఇటిపి ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో జరుగబోయే పరిణామాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు కాయితి రమేష్‌గౌడ్, చెన్నగోని అంజయ్యగౌడ్, బాతరాజు సత్యం, బత్తుల శంకర్, మల్కాపురం నరసింహా, కప్పల శ్రీనివాస్, బద్దం అంజయ్య, చెన్నగోని విజయలక్ష్మి, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, సుర్వి నరసింహా, కొంతం రాంరెడ్డి, బడుగు మణెమ్మ, బత్తుల వరలక్ష్మి, కొండూరు వెంకన్న, పాశం సంజయ్‌బాబు, మొగుదాల రమేష్‌గౌడ్, చింతల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మనీ లాండరింగ్ చేస్తే చర్యలు
* డిఎస్‌పి రాంగోపాల్‌రావు
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 10: చట్ట విరుద్ధంగా మని లాండరింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డిఎస్‌పి ఎస్.రాంగోపాల్‌రావు అన్నారు. శనివారం స్థానిక సబ్‌డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఒన్, టూటౌన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సుమారు 80 మంది మనిలాండరింగ్ వారిని బైండోవర్ చేయించడం జరిగిందని ఆయన అన్నారు. ఇంకా కొంతమంది బారా కటింగ్, మీటర్ కటింగ్ అంటూ చిరు వ్యాపారుల నుండి ఉద్యోగులు, పెద్ద వ్యాపారులకు కూడ భారీ వడ్డిపై అప్పులు ఇస్తున్నట్టు తెలిసిందన్నారు. అలాంటి వారిపై ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అదే విధంగా బ్యాంకు అధికారులంటూ కొంతమంది ఫోన్‌లో బ్యాంకు ఖాతా, ఎటిఎం పిన్ నెంబర్లు అడిగి ఖాతాలో ఉన్న డబ్బులను స్వాహా చేస్తున్నారని వారితో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏ బ్యాంకు అధికారి కూడ ఖాతాదారుడి నెంబర్లు అడగరని, కావాల్సి ఉంటే బ్యాంకుకు పిలిపించి వివరాలు సేకరిస్తారని ఆయన అన్నారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఒక మహిళను ఫోన్‌లో చత్తీస్‌గఢ్ నుండి వివరాలు సేకరించి ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేశాడని ఆయన అన్నారు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. శాంతికి విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సదస్సులో ర్యాగింగ్, టీజింగ్, మైనర్ బాలికల ప్రేమలు, కిడ్నాప్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో ఒన్‌టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి ఉన్నారు.