నల్గొండ

మహిళా సమస్యల పరిష్కారంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, డిసెంబర్ 10: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎంసిపిఐయు జాతీయ కార్యదర్శి ఎండి.గౌస్ ఆరోపించారు. ఎఐఎఫ్‌డి తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలు శనివారం ముగిశాయి. ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో మహిళలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట వీరవనితల ధీరత్వాన్ని పునికిపుచ్చుకోని ఉద్యమించాలని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం పాలకులు చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో విఫళమయ్యారని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం మూడు సంవత్సరాల క్రితం నిర్భయ చట్టం తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడంలేదని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు తీసుకరావడంపై చూపిన శ్రద్ధ అమలుపై పాలకులు చూపడంలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ జిల్లా వీరవనితలు లక్ష్మక్క, చాకలి ఐలమ్మలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఎందరో అమరవీరుల రక్తంతో తడిసిన నల్లగొండ జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లో మహిళ సంఘాలను ఏర్పాటు చేసి అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ప్రజాపోరాటాలకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఐఎఫ్‌డి రాష్ట్ర కన్వీనర్ కుంభం సుకన్య, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, సహాయ కార్యదర్శి సాంబయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వరికుప్పల వెంకన్న, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి మట్టయ్య, మహిళ సంఘం జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, తాండ్ర కళావతి, పుష్ప, సంధ్య, సంగమ్మ, రాధా పాల్గొన్నారు

పార్టీని వీడినవారు చరిత్ర హీనులు
* సిపిఎం రాష్ట్ర కార్యవర్గ
సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
కేతేపల్లి, డిసెంబర్ 10: రాష్ట్రంలో ఒక పార్టీలో గెలుచి మరోక పార్టీలో చేరి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వారు చరిత్ర హీనులు అవుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండల సిపిఎం సర్వసభ్య సమావేశాన్ని మండలకేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాజకీయ విలువలను తుంగ్గలో తొక్కి అధికార దాహం, కాంట్రాక్టు పనుల కోసం రాజకీయ జన్మనించిన పార్టీలను వీడి అధికార పార్టీకి వెళ్లడం వల్ల గెలుపించిన ప్రజలకు దోహం చేసిన వారు అయ్యారని అన్నారు. అలాంటి వారికి భవిష్యత్‌లో రాజకీయ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సిపిఎం పార్టీ మహాసముద్రం లాంటిదని నాలుగు, ఐదు నీటి చుక్కలు బయటకు పోయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు.