నల్గొండ

నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, డిసెంబర్ 10: జాతీయ గ్రామీణా ఉపాధి హామి పథకంలో నిదుల దృర్వినియోగానికి పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని జిల్లా ఎపిడి షేక్ హిమామ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన 9వ విడుత సామాజిక తనిఖిపై ప్రజావేధిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు. మండలంలోని వివిద గ్రామాలలో ఉపాధి హామి పథకంలో అగష్టు 2015-సెప్టెంబర్ 2016 వరకు 44లక్షల10వేలు మెటిరీయల్‌కు, 9కోట్ల7లక్షల రూపాయలు కూలీలకు పంచిన నిదులపై నవంబర్ 30వ తేది నుండి ఈనెల 9వరకు సామాజిక తనిఖి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సింగారం, కచిలాపురం, కోరటికల్, చొల్లేడు, పులిపలుపుల గ్రామాలపై చర్చ పూర్తి అయినట్లు తెలిపారు. ఈ చర్చలో కొంత నిదుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. మిగతా గ్రామాలపై చర్చించి పూర్తి నివేధిక నేడు తెల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సామాజిక తనిఖి చేయడం ద్వారా నిదుల దుర్వినియోగం తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఎపిడి శరణ్‌గౌతమ్, ఎంపిపి మేడి నాగలక్ష్మి, జెడ్పిటిసి జాజుల అంజయ్యగౌడ్, ఎంపిడివో సీతాకుమారి, ఎస్‌టిఎం రజిత, ఎస్‌ఆర్‌పి జయప్రకాశ్, కుమార్, క్యూసి పసివృద్దిన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు దేశిడి యాదయ్య, ఎంపివో సుదాకర్, వివిద గ్రామాల సర్పంచులు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీల్డ్ అసిస్టెంట్లు, ప్రజాపతినిదులు తదితరులు పాల్గోన్నారు.

ఘనంగా సాగర్ డ్యాం శంకుస్థాపన దినోత్సవం
కోదాడ, డిసెంబర్ 10: నాగార్జునసాగర్ డ్యాంకు శంఖుస్ధాపన చేసి 61 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా కోదాడలో శనివారం కోదాడలో కాంగ్రెస్ పార్టీ సాగర్ డ్యాం శంఖుస్ధాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ కార్యాలయంలో సాగర్ ఎడమ కాలువ మాజీ ఛైర్మన్ చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి శనివారం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్ట్ ఆధునిక దేవాలయమన్నారు. దేశంలోని బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ల్లో సాగర్ అత్యంత ప్రధానమైనదని ఆయన చెప్పారు. నెహృ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన చేయగా 1967లో ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారని ఆయన వివరించారు. కాంగ్రెస్ కృషితోనే నిర్మించబడిన సాగర్ డ్యాం పరిధిలో రెండుపంటలు పండుతున్నాయని, ఇలాంటి అనేక ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షులు వంగవేటి రామారావు, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు, మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చింతలపాటి శ్రీనివాస్, విద్యాసాగర్‌రెడ్డి, షమ్మి, సైదిబాబు, ఉద్దండు, పాశం శ్రీను, ముస్కు శ్రీను, వంగవీటి శ్రీను, తిపిరిశెట్టి రాజు పాల్గొన్నారు.