నల్గొండ

అభివృద్ధి జాడలు.. కొత్త రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 10: ప్రాంతాల మధ్య రవాణతో పాటు అభివృద్ధికి మార్గాలుగా రహదారులు ఉపకరిస్తుండటంతో రహదారుల వ్యవస్థ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మరో మూడు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ప్రగతి పరుగులకు ఈ రహదారులు దోహదం చేస్తాయన్న ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే ఉన్న హైద్రాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65, హైద్రాబాద్-్భపాలపట్నం ఎన్‌హెచ్ 163లకు తోడుగా హైద్రాబాద్-కొత్తగూడెం-్భద్రాచలం వరకు, చౌటుప్పల్-బెంగుళూర్, సంగారెడ్డి-మహారాషట్రల మధ్య రహదారులు జాతీయ రహదారులుగా గుర్తించి విస్తరణకు నిధులు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందించారు. హైద్రాబాద్ నగరంపై ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో ఈ రహదారులను హైద్రాబాద్ శివారు ప్రాంతాలను కలుపుతు ఔటర్ రింగ్ రోడ్లను కలుపుతు అనుసంధానించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలుపుతు ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-163లకు అనుసంధానంగా విస్తరించే కొత్త జాతీయ రహదారులతో హైద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. కొత్త జాతీయ రహదారుల విస్తరణ కోసం భూసేకరణ అనుమతుల సాధనకు సైతం వేగంగా చర్యలు సాగుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి-చిట్యాల మధ్య 152కిలోమీటర్ల జాతీయ రహదారి ఏర్పాటుతో నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కలకత్తా, చెన్నై, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య రవాణ వ్వయస్థ మెరుగుపడనుంది. అలాగే చౌటుప్పల్ నుండి బెంగుళూర్ రహదారి-44 కంది ప్రాంతం వరకు 188కిలోమీటర్ల జాతీయ రహదారితో నారాయణపూర్, రాచకొండ, రంగారెడ్డి జిలాలల మీదుగా ఏపి, చెన్నై, బెంగుళూర్, కలకత్తాలకు రహదారి వ్యవస్థ అభివృద్ధి చెందనుంది. హైద్రాబాద్ ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఎదులబాద్, బీబీనగర్, వలిగొండ, మోత్కూర్, సూర్యాపేట, మహబూబ్‌బాద్‌ల మీదుగా కొత్తగూడెం, భద్రాచలం వరకు విస్తరించే రహదారితో ఈ మార్గాంలోని ప్రాంతాల మధ్య అభివృద్ధి దారులు విస్తరించనున్నాయి. ఆయా జాతీయ రహదారులకు అనుసంధానంగా రాష్ట్ర, జిల్లా మార్గాలన్ని అభివృద్ది దిశగా మరింత ముందడుగు వేయనున్నాయి.