నల్గొండ

నయనానందకరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జనవరి 15: శ్రీగోదాదేవి, రంగనాథస్వామిల కల్యాణం మండలంలోని నేరడలో శ్రీ ఆండాల్ ఆల్వార్లసహిత శ్రీసీతారామాంజనేయస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నయనానందకరంగా జరిగింది. మార్గళి ధనుర్మాసము ముగింపును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆనవాయితీగా శ్రీసీతామాంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించే శ్రీగోదాదేవిరంగనాథస్వామిల తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. వేకువజామునే గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో దేవాలయానికి చేరుకుని తిరుప్పావై సేవాకాలము సామూహిక పారాయణాలు ప్రత్యేక పూజకార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేదాంతం శ్రీనివాసాచార్యులు, సహార్చకులు పవనకుమాచార్యులు, రామకృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను, పంచామృత అభిషేకాలను నిర్వహించారు. శ్రీరంగనాథస్వామికి-శ్రీగోదాదేవీ అమ్మవారికి పట్టు వస్త్రాలను, పూలమాలలతో అలంకరించి ఎదరుర్కోళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుడిగా శ్రీరంగనాథస్వామి, వధువుగా శ్రీగోదాదేవితో జరిపించిన కల్యాణం భక్తులను రంజింపజేసింది. స్వామి అమ్మవారికి తాళికడుతున్న దృశ్యాన్ని వేదపండితులు వివరించిన క్షణాలను భక్తులు స్వామివారి ఆశీస్సుల కోసం భక్తిశ్రద్ధలతో తలచుకుని ఆశీర్వాదాన్ని పొందారు. అనంతరం తలంబ్రాల వేడుకలను కూడా నయనానందకరంగా నిర్వహించడంతో భక్తుల హృదయాలు పులకించిపోయాయి. కల్యాణ వేడుకల్లో భక్తులు అశేశంగా హాజరై శ్రీగోదారంగనాథస్వామిల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. భక్త జనుల సమక్షంలో గోదాదేవి కల్యాణాన్ని పురోహితులు చూడముచ్చటగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి వడిబియ్యంను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంకాలం రథోత్సవాన్ని భగవన్నామ సంకీర్తనల నడుమ వైభవంగా నిర్వహించారు. మార్గళి ధనుర్మాస మహోత్సవాలను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మోడల్ విలేజి రూపకల్పనకు కృషి
* కలెక్టర్ సురేంద్రమోహన్
మునగాల, జనవరి 15: విజయరాఘవపురం గ్రామాన్ని మోడల్ విలేజిగా రూపొందించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మండలపరిధిలోని విజయరాఘవపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంబరాల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅధిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సంక్రాంతి ఉత్సవాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఈనెల 19న సమీక్షా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో 90కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవన్నారు. వాటి నిర్మాణానికి రూ. 10లక్షలు మంజూరీచేస్తానన్నారు. గ్రామాల్లో 100శాతం అక్షరాస్యత సాధించేందుకు సమాఖ్య సభ్యులు కృషిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలగాలని ఇందుకై సంబంధిత పిహెచ్‌సిలో వౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరీచేస్తానన్నారు. నగదు రహిత లావాదేవీలపై గ్రామస్తులకు అవగాహన ఉండాలన్నారు.