నల్గొండ

ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 15: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతో పాటు అన్నిమండలాలు, గ్రామాలలో పండుగ వేడుకలు అబరాన్నంటాయి. పండుగ సందర్భంగా వివిధసంస్ధల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల, వంటలపోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని శనివారం దేవాలయాల్లో ప్రత్యేకపూజ కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే మకరసంక్రాంతి నాడు భగవంతున్ని ప్రార్ధిస్తే సకలశుభాలు జరుగుతాయని శాస్త్రాలు పేర్కొంటుండడంతో ప్రజలు భక్త్భివంతో పూజలుచేశారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీషిరిడి సాయిబాబా, శ్రీ సంతోషిరూపాదేవి, శ్రీఅయ్యప్పస్వామి, శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చే పతంగులను యువకులు పోటాపోటీగా ఎగురవేస్తూ కన్పించారు. పట్టణంతోపాటు చుట్టూపక్కలఉన్న పల్లెల్లో పండుగవేడుకలు మరింత ఉత్సాహంగా జరిగాయి. గ్రామాలలో హరిదాసులు, గంగిరెద్దులు దర్శనమివ్వగా పట్టణాల్లోమాత్రం వాటి జాడకనరాలేదు. కొన్నిగ్రామాలల్లో సంప్రదాయాలకు అనుగునంగా ఎడ్లపందెలను నిర్వహించారు. పాడిపశువుల పండుగగా చెప్పుకునే కనుమపండుగ రోజున గ్రామాలలో రైతులు తమ పాడిపశువులకు పూజలు చేశారు.
సమాచార చట్టంపై అవగాహన ఉండాలి
* సమాచార హక్కు కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు
సూర్యాపేట, జనవరి 15: సమాచార హక్కు చట్టంపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం కమీషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై పట్టణ ప్రాంతాల ప్రజలు, విద్యావంతులు, అధికారులు, విద్యార్ధులు, వ్యాపారులకు అవగాహన ఉంటుంది తప్ప గ్రామీణ ప్రజలు, సామాన్య ప్రజలకు ఈ చట్టం గురించి ఏ మాత్రం తెలియదన్నారు. అందువల్ల అధికారులు, స్వచ్చంద సంస్థలు, విద్యావంతులు సమాచారం చట్టంపై గ్రామీణ ప్రజలను చైతన్య పర్చేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. జిల్లాస్థాయిలో సమాచారం హక్కు చట్టానికి కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కో-ఆర్డినేటర్‌గా డిఆర్‌వోలు వ్యవహరిస్తారన్నారు. సమాచార చట్టం ద్వారా ఏ ప్రభుత్వ శాఖ ద్వారనైన ఏ పథకానికి సంబంధించిన వివరాలైన, ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులు, వాటి ఖర్చు వివరాలను సైతం తెలుసుకోవచ్చునన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, మున్సిపల్ కమీషనర్ వడ్డె సురేందర్, టిఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల అవకుశ, కౌన్సిలర్లు గండూరి పావని, తండు శ్రీను, కో-ఆప్షన్ సభ్యురాలు స్వరూపారాణి, టిఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాశ్, గండూరి కృపాకర్, బూర బాలసైదులు, పూర్ణశశికాంత్, మున్సిపల్ డిఈ వెంకటేశ్వర్లు, శానిటరి ఇన్స్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, చక్రహరి నాగరాజు, గుడిసె శేఖర్, రాచకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.