నల్గొండ

ఆగని సర్కారీ బియ్యం అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 15: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పిడిఎస్ బియ్యంతో మిల్లర్లు, డీలర్లు సాగిస్తున్న అక్రమ దందాకు అడ్టుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం విమర్శల పాలవుతుంది. సర్కార్ బియ్యం అక్రమరవాణాదారులపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించినా జిల్లాల్లో ఏడాదిన్నరగా అక్రమదారుల్లో పిడిఎస్ బియ్యం విక్రయం, రవాణా ఘటనలు వరుసగా వెలుగుచూస్తునే ఉన్నాయి. నెల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల 1000క్వింటాళ్ల మేరకు పిడిఎస్ బియ్యం సగటున పట్టుబడుతున్న తీరు పిడిఎస్ బియ్యం అక్రమ దందాకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇటీవల డిండి, దేవరకొండల్లోనే ఏకంగా 400క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా వాటిని ఎక్కడి నుండి తెచ్చి నిల్వ చేసి ఎక్కడ విక్రయించారన్నదానిపై నిగ్గు తేల్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటిలాగే 6ఏ కేసులు, క్రిమినల్ కేసులకే పరిమితమైన వైనం విమర్శల పాలైంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా హ్టాసల్స్, పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై మిల్లర్లు, డీలర్లు, వ్యాపార్ల కన్నుపడింది. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఈ దిశగా అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో అందుకు సిద్ధపడటం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా జిల్లాల్లో పిడిఎస్ బియ్యం ఎంత పట్టుబడింది. ఎన్ని కేసులు నమోదుచేశారన్నదానిపై రికార్డు సైతం జిల్లా పౌరసరఫరా శాఖ యంత్రాంగం వద్ధ లేకపోవడం గమనార్హం. ప్రస్తుత లెక్కల మేరకు నెలకు ఒక్కో జిల్లాలో 15 నుండి 30 వరకు పిడిఎస్ బియ్యం పట్టివేత కేసులు నమోదవ్వగా, వెలుగుచూడని పిడిఎస్ బియ్యం ఇంకెన్ని టన్నులు అక్రమార్కుల జేబులు నింపుతుందోనన్న సంగతి ఆందోళకరం. ఒక్క మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల నుండే వారానికి 50 డిసిఎంల మేరకు కాకీనాడ పోర్టు, విజయవాడ, గుంటూరులకు పిడిఎస్ బియ్యం అక్రమరవాణా అవుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.
కాగా జిల్లాల్లో 9,69,160 కుటుంబాలకు ఆహారభద్రతా కార్డుల ద్వారా నెలనెల 18,853టన్నులు బియ్యం 2081చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా జరుగుతుంది. ఇందుకు నెలకు 45కోట్లు, ఏటా 540కోట్లు సబ్సిడీగా ఇస్తుంది. అటు 376ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, 3308పాఠశాలలకు సన్న బియ్యం నెలకు 1100టన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతినెల తహశీల్ధార్ల ద్వారా ప్రతి చౌక దుకాణాడీలర్ల నుండి పంపిణీ చేయగా మిగిలిన బియ్యం, ఇతర రేషన్ సరుకుల వివరాలను ప్రతి నెల ఈపిడిఎస్ వెబ్‌సైట్ నుండి అప్‌లోడ్ చేస్తుండటం అనవాయితి. ఐనప్పటికి జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణ దందా ఆగడం లేదు. ఎంఎల్‌ఎస్ గోదాం పాయింట్ల వద్ధ కొంత, డీలర్ల వద్ధ కొంత, పిడిఎస్ బియ్యం వినియోగంచని వారి నుండి దళారీలు సేకరించే బియ్యం కొంత, పాఠశాలలు, హాస్టల్స్ నుండి పక్కదారిగా లభించే బియ్యం కొంత ఇలా తలోదారిలో పిడిఎస్ బియ్యం అక్రమ దందా సాగుతుంది.