నల్గొండ

డిసిసిబిలో కుర్చీ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 15: డిసిసిబిలో చైర్మన్ కుర్చీ చుట్టు రాజకీయ పోరు మలుపుల మీద మలుపులు తిరుగుతు ఉత్కంఠత రేపుతుంది. కాపుగల్లు సహకార సంఘం పాలకవర్గం రద్ధుతో ఈ సంఘం చైర్మన్‌గా ఉన్న ముత్తవరపు పాండురంగారావు డిసిసిబి చైర్మన్ పదవికి ఎసరు రావడంతో పదవిని కాపాడుకునేందుకు పాండురంగారావు, ఎలాగైనా సరే ఆయనను దించేందుకు ప్రత్యర్ధి వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాపుగల్లు సొసైటీలో నెలకొన్న 83లక్షల అక్రమాల కేసులో పాలకవర్గాన్ని రద్ధు చేస్తు డిసెంబర్ 8న సూర్యాపేట డిసివో ఉత్తర్వులిచ్చారు. ఈ నిర్ణయంతో డిసిసిబి చైర్మన్ పదవి కోల్పోవాల్సివస్తుండటంతో పాండురంగారావు హైకోర్టుకు వెళ్లి ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించేలా ఊరట పొందారు. సహకార ట్రిబ్యూనల్‌కు వెళ్లిన పాండురంగారావుకు అనుకూలంగా కాపుగల్లు సొసైటీ పాలకవర్గం రద్ధును నిలిపివేస్తు ఉత్తర్వులివ్వడంతో కాపుగల్లు సొసైటీ పాలకవర్గం బాధ్యతలను పాండురంగారావు మళ్లీ చేపట్టి డిసిసిబి చైర్మన్ పదవికి ఎదురైన ముప్పును తాత్కాలికంగా తప్పించుకున్నారు. అయితే సహకార ట్రిబ్యూనల్ ఉత్తర్వులపై ప్రత్యర్ధి వర్గం హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తాజాగా సహకార ట్రిబ్యూనల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో మళ్లీ కాపుగల్లు సొసైటీ చైర్మన్‌తో పాటు డిసిసిబి చైర్మన్ పదవిని పాండురంగారావు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అటు ఈ నెల 26వ తేదిలోగా చైర్మన్ హోదాలో పాండురంగారావు డిసిసిబి సర్వసభ్య సమావేశం నిర్వహించని పక్షంలో ఆయన సహకార చట్టం మేరకు కూడా పదవి కోల్పోయే ప్రమాదముంది.
ఒత్తిడి పెంచుతున్న యెడవెల్లి వర్గం
మరోవైపు పాండురంగారావు ప్రత్యర్ధి వర్గమైన యెడవెల్లి విజయేందర్‌రెడ్డి, పీరునాయక్, పిల్లలమర్రి శ్రీనివాస్, చాపల లింగయ్య, పాశం సంపత్‌రెడ్డి, ఏర్పుల సుదర్శన్, రవిందర్‌రెడ్డిలు వెంటనే డిసిసిబిని సమావేశపరిచి తాత్కాలిక చైర్మన్‌ను ఎన్నుకోవాలంటు డిసివో, డిసిసిబి సీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి ఆశిస్సులు సైతం యెడవెల్లి వర్గానికే ఉండటం కూడా ఈ వివాదాన్ని మరింత జఠిలం చేస్తుంది. తాజాగా సహకార ట్రిబ్యూనల్ ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసిన నేపధ్యంలో పాండురంగారావు తదుపరి న్యాయపోరాట ఎత్తుగడ ఎలా ఉండబోతుందన్నదీ ఆసక్తికరంగా మారింది. మరో 13 నెలల పదవి కాలాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో పాండురంగారావు డిసిసిబి చైర్మన్ పదవిని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో డిసిసిబి చైర్మన్ పదవి కోసం ఇటు పాండురంగారావు, అటు యెడవెల్లి వర్గాలు సాగిస్తున్న ఎత్తుకు పై ఎత్తులు ఏ రోజు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠత నెలకొంది.