నల్గొండ

రామనవమికి నల్లగొండ రామాలయం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్(నల్లగొండ), ఏప్రిల్ 14: శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ రెండో భద్రాద్రిగా ప్రఖ్యాతినొందిన నల్లగొండ రామగిరి ర
మాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు సీతారాముల కల్యాణోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చక బృందం ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్వామివారి కల్యాణోత్సవ ఘట్టానికి ముందుగా గురువారం రాత్రి ఎదుర్కోలు ఘట్టాన్ని నిర్వహించారు. నేడు ఉదయం 10గంటలకు నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి కల్యాణ మండపాన్ని, దేవాలయాన్ని విద్యుత్ దీపకాంతులతో, వివిధ రంగులు, పచ్చని తోరణాలు, పూల దండలతో అందంగా అలంకరించారు. రాత్రి వేళ విద్యుత్ దీపాకాంతులతో రామాలయం సీతారాముల కల్యాణ వేడుకలకు భక్తులను ఆకర్షించేలా దేదీప్యమానంగా వెలుగుతు కనిపించింది. వేలాది మంది భక్తులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఇతర ప్రజాప్రతినిధులు సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు.