నల్గొండ

21న బాల ఆలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14: ఈ నెల 18వ.తేది నాటికి బాల ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసి దేవస్ధానానికి అప్పగిస్తామని వైటి డి ఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. గురువారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. బాల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రధాణ ఆలయం మాదిరిగానే బాల ఆలయం లోపల అదే మాదిరిగా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. సుమారు 3కోట్లతో నిర్మించే బాల ఆలయం కొత్త హంగులతో రూపు దిద్దు కుంటుందన్నారు. నిర్మాణం ఇప్పటికే పూర్తి కావచ్చిందన్నారు. బాల ఆలయ సమీపంలోనే కళ్యాణమండపం, సత్యనారాయణ స్వామి వ్రతమండపం నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు. 21వ తేది అనతంరం ప్రధాణ ఆలయ రెండవ దశ కూల్చివేత పనులు చేపడతామన్నారు. నృసింహ్మకాంప్లెక్సు, ఆలండాల్ నిలయం, అద్దాల మండపం, ప్రసాదాల తయారి మండపంతో సహా రెండవ దశ కూల్చివేతల్లో నేల మట్టం కానున్నాయన్నారు. కొండపైన మంచినీటి కొరత విషయంపై విలేకర్లు ప్రశ్నించగా త్వరలోనే నీటి సమస్యను అధిగమిస్తామన్నారు. ప్రధాన ఆలయ నిర్మానానికి సంబందించి టెండర్లు కూడా ఖరారయ్యాయని చెప్పారు. ఆలయ దక్షిణ బాగంలో నిర్మించే రిటర్నింగ్ వాల్ తో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
కార్యక్రమంలో దేవస్దానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, ఆర్కిటెక్టు ఆనందసాయి, రవి పాల్గొన్నారు.
యాదాద్రిని సందర్శించిన డిజిపి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి క్షేత్రాన్ని గురువారం రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ సందర్శించారు. ఈ సందర్బంగా యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు.్భధ్రతపై సమీక్షించారు. బాల ఆలయనిర్మాణ స్ధలాన్ని ఆలయ పరిసరాలను పరిశీలించారు. యాదాద్రి క్షేత్రం ప్రపంచస్దాయిలో అభివృద్ది చెందుతున్నందన భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు.
ఆయన వెంట ఐజి నవీన్‌చంధ్, నల్లగొండ ఎస్‌పి విక్రమ్‌జిత్ దుగ్గల్, భువనగిరి డిఎస్‌పి మోహన్‌రెడ్డి గుట్ట సిఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.