నల్గొండ

రైతుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, ఏప్రిల్ 17: రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సిఎల్పీ ఉపనేత, స్థానిక నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐదులక్షల నిధులతో నిర్మించనున్న సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. తదుపరి పాతపల్లి గ్రామంలో దేవాదాయ శాఖ నిధులు 3లక్షల నిర్మించిన సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం, నూతన విగ్రహా ప్రతిష్టాపనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నియోజకవర్గం అభివృద్ధికి వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బిసి, ఉదయ సముద్రం ప్రాజెక్టులతో నియోజకర్గంలోని అన్ని మండలాలకు సాగుతాగునీరందించేందుకు తన కృషి కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు కృష్ణా జలాలు అందుతున్నాయని మరిన్ని గ్రామాలకు ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా నీరందించి రైతులకు మేలు చేసినప్పుడు తన జీవితం ధన్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరక్టర్ సంపత్‌రెడ్డి, జూకు రమేష్, కోఆప్షన్ మెంబర్ ఇబ్రహీమ్, కౌన్సిలర్లు సమాధానం జ్యోతి, కుంజ వెంకన్న, దండెంపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.