తెలంగాణ

చెరువులో పడి ఐదుగురు మృతి నల్లగొండ జిల్లాలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతెపల్లి, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల కేంద్రంలోని నిమ్మలమ్మ చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మృతులంతా అన్నదమ్ముల పిల్లలు. మృతుల్లో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. కేతెపల్లి చెందిన లూర్ధూ రాజ్‌కుమార్ కుమార్తెలు పసల పూజిత (13), పసల సాత్విక (9), పసల ఆరోగ్యయ్య కుమారుడు పవన్‌కుమార్ (15), పసల రాజు కుమార్తె శిరీల్ (11), కుమారుడు తేజు (7) మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. వారిని గమనించిన స్థానికులు అక్కడి నుండి వెనక్కి పంపించారు. ఈత కొట్టాలన్న సరదాతో మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు ఎవరూ లేని సమయంలో చెరువు వద్దకు వెళ్లి నీటిలోకి దిగారు. పిల్లలు ఐదుగురిలో ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతున్నవారు పరస్పరం కాపాడే ప్రయత్నంలో ఒకరికొకరు పట్టుకుని నీటిలో మునిగిపోయారు. సాయంత్రం కొందరు స్థానికులు పొలాల వద్ధ నుండి ఇంటికి వెళ్లే సమయంలో చెరువు ఒడ్డున ఉన్న పిల్లల దుస్తులు గమనించి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో రాత్రి 7 గంటల సమయంలో గాలింపు చేపట్టారు. చివరకు నీటిలో నుండి ఐదుగురి మృతదేహాలను రాత్రి 8 గంటలకు ఒడ్డుకు తీసుకువచ్చారు. సంఘటన సమాచారం తెలుసుకున్న స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపిపి గుత్తా మంజుల, జడ్పీటిసి జటంగి లక్ష్మమ్మ చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సంఘటనపై నకిరేకల్ సిఐ సుబ్బరాంరెడ్డి, కేతెపల్లి ఎస్‌ఐ ఎం.కృష్ణయ్య కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.