నల్గొండ

వ్యర్థ కెమికల్ డ్రమ్ముల గుట్టరట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 11: గత ఆరు నెలలుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం సృష్టిస్తున్న వ్యర్థ రసాయన కెమికల్ డ్రమ్ములను వదిలేసి వెళ్లిన మిస్టరీని యాదాద్రి పోలీసులు చాకచక్యంగా చేధించారు. సీసీ పుటేజీలు, ప్రజల సహకారంతో పోలీసులు కేసు చేధించారని యాదాద్రి డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిగుట్ట, గుండాల, రాజాపేట్, బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆలేరులో నెలకొక ప్రాంతంలో వ్యర్థ రసాయన కెమికల్ డ్రమ్ములను ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చి వదిలి వెళ్లడం జరుగుతుందన్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోలనకు గురైనారని, వ్యర్థ రసాయన కెమికల్ డ్రమ్ముల నుండి వెలువడే రసాయనాల ద్వారా పర్యావరణం, నీరు కలుషితమవుతుందని తద్వారా ప్రజలకే కాకుండా జీవరాశికి కూడా ప్రమాదం పొంచివున్నదన్నారు. ఈ కెమికల్ డ్రమ్ముల దందాలో ఎంతటి వారున్నా శిక్ష తప్పదని అన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా టవేరా వాహనంలో వెలుతున్న ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించగా రెండు లారీలను మూటకొండూర్ ప్రాంతంలో ఉన్నాయన్న సమాచారంతో రెండు లారీలను, ఒక టవేరా బండిని సీజ్ చేశారు. టవేరా వాహనంలో వెళ్తున్న చేర్యాల గ్రామానికి చెందిన అనె్నం నర్సిరెడ్డి, తునికి ఉపేందర్, నల్ల శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించగా వివిధ ప్రాంతాలలో ఉన్న కెమికల్ డ్రగ్ లాబరెటీస్‌కు చెందిన కంపెనీలలో వ్యర్థ పదార్థాలను తీసుకు వచ్చేందుకు కొంత మంది సహకరించినట్లు తెలిపారు. ఆయా కంపెనీలలో పని చేస్తున్న వారు నక్కల రాంబాబు, గంగల్‌రెడ్డి వెంకట్ రెడ్డి, బాలూ నాయక్‌ల సహకారంతో తలసాని క్రిష్ణకుమార్‌కు చెందిన విజేత లాబ్ ప్రైవేటు లిమిటెట్, రాజేశ్వర్‌రెడ్డికు చెందిన వీరు ప్రకాష్ లాబరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ జీడిమెట్ల, సత్యనారాయణ కెఎమ్‌టిఎమ్ లాబరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ విజయవాడ, సిహెచ్ రామకృష్ణ యాగ్‌మాగ్ ల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ పాశమైలారం, సిహెచ్ చంద్రశేఖర్ అమృతా కెమికల్ ప్రైవేటు లిమిటెడ్ బొల్లారం, బి రమేష్ గోల్డెన్ స్ట్రీక్ లాబరెటీస్ ప్రైవేటు లిమిటెడ్ వెలిమినేడు, డి మురళి కృష్ణ సాలుబ్రయిస్ ప్రైవేటు లిమిటెడ్ బీదర్ ఉన్నారన్నారు. కంపెనీల నుండి వెలువడే వ్యర్థ కెమికల్ రసాయన డ్రమ్ములను పర్యావరణ అనుమతులతో అక్కడి కంపెనీలలోనే శుద్ధి చేసే యంత్రాల ద్వారా శుద్ధి చేసి భూమిలోకి పంపించాలని దీనికి ఎక్కువ ఖర్చు అవుతుండడంతో ఇలా దొడ్డి దారిన యాజమాన్యాలు వీరికి అప్పగించడంతో వారు ఇతర ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా వదిలి వెళ్తున్నారరని డీసీపీ రామచంద్రారెడ్డి వివరించారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నామని కేసులు నమోదు చేసుకుని రిమాండ్‌కు పంపించనున్నట్లు చెప్పారు. ముగ్గురు పరారీలో ఉన్నాపరని మిగితా వారిపైన వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. వీరికి సహరించిన కంపెనీలపైన పర్యావరణ బోర్డు వారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రెండు లారీలు, టవేరా వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా వ్యర్థ రసాయనాల వదిలివెల్లి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఏసీపీ శ్రీనివాసచార్యులు, గుట్ట సీఐ ఆంజనేయులు, మూటకొండూర్ ఎస్‌ఐ అశోక్‌కుమార్, గుట్ట ఎస్‌ఐ నాగిరెడ్డి, తుర్కపల్లి ఎస్‌ఐ వెంకటయ్య, ఆలేరు ఎస్‌ఐ నరేందర్, సిబ్బంది చంద్రవౌళి, ఎండీ శంశుద్దీన్, మహేందర్, భూపాల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డిలను అభినందించారు. వీరికి ప్రభుత్వం నుండి రివార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని డీసీపీ రాంచంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాసాచార్యులు, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.