నల్గొండ

నెలఖరులోగా భగీరథ పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ధేశించిన గడువు ఈనెలఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్, దళిత కులాల అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, నీటి పారుదల, మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల పూర్తిలో నిర్లక్షం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కుసుమవారిగూడెం - శెట్టిగూడెం రహదారి నిర్మాణ పనులను ఆలస్యం చేస్తున్న సంస్థకు నోటిసులు ఇవ్వాలని ఆదేశించారు. దాచారం - కూడలి రహదారి పనులను ప్రారంభించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం కోసం రూ.100 కోట్లు నిధులు కేటాయించినా నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లో ఉన్న సంబంధిత అధికారులు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. నియోజవర్గంలో మిషన్ కాకతీయ నాలుగవదశ కింద చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రతిపాదనలను పూర్తి చేయాలన్నారు. పాలేరు, మూసీ నదులపై నిర్మించ తలపెట్టిన చెక్‌డ్యాంలతో పాటు మూసీ నది కాలువల ఆధునీకరణనకు పాలనపరమైన అనుమతులను తక్షణమే పొందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువుపై నిర్మించ తలపెట్టిన మినీట్యాంక్ బండ్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ కింద గ్రామాల్లో చేపట్టే అంతర్గత పైప్‌లైన్ల పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా భారీగా నిధులు కేటాయిస్తున్నా ఆశించిన మేర పనుల్లో ప్రగతి కనిపించడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారులు తీరును మార్చుకొని పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసమావేశంలో ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ చీఫ్ రవీందర్‌రావు, గణపతిరెడ్డిలతో పాటు నియోజకవర్గానికి చెందిన పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

చర్లగూడెం బాధితుల పక్షాన
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలి
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు పాల్వాయి స్రవంతిరెడ్డి వినతి
మర్రిగూడ, డిసెంబర్ 12: చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములను కోల్పోతున్న భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, నిర్వాసితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి మంగళవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. 111 రోజులుగా భూ నిర్వాసితులు నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తున్నారని, పోలీసులు లాఠీచార్జీ చేసి నిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా పోలీస్ బలగాలను మోహరించి రిజర్వాయర్ పనులను కొనసాగించడం బాధాకరమైన విషయమన్నారు. ఈవిషయం పట్ల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారని, త్వరలోనే చర్లగూడెం వచ్చి బాధితులకు మద్దతు తెలిపి, ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆమె వెంట యూత్ కాంగ్రెస్ మునుగోడు ఉపాధ్యక్షుడు మల్గిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, మాదగోని మహేశ్‌గౌడ్ ఉన్నారు.

సీఎం కెసిఆర్‌తో ఉమా, సందీప్‌రెడ్డిల భేటీ..!
*14న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా వెల్లడి *ఆలేరు లేదా ఉప్పల్‌కు పైళ్ల షిఫ్ట్ !?

నల్లగొండ, డిసెంబర్ 12: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. మంగళవారం వారు ప్రగతిభవన్‌లో సీఎం కెసిఆర్‌ను కలుసుకుని టీఆర్‌ఎస్‌లో చేరడంపై కీలక చర్చలు జరిపారు. మంత్రులు టి.హరీష్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి ఆమె కెసిఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఉమా, సందీప్‌లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14న తమ మద్దతుదారులు, అభిమానులు, వెంట వచ్చే టీడీపీ శ్రేణులతో కలిసి సీఎం కెసిఆర్ సమక్షంలో చేరనున్నట్లుగా ప్రకటించారు. ఉమా భర్తయైన దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 1985నుండి వరుసగా నాలుగు పర్యాయాలు భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. నక్సల్స్ చేతిలో మాధవరెడ్డి హత్య పిదప రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2004, భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గాలిలో ఉమా ఓటమి చవిచూశారు. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి ఉమా, సందీప్‌లు టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఉమామాధవరెడ్డి గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడే తాను టీడీపీని వీడనున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే ఆమె కాంగ్రెస్‌లో చేరుతారా లేక టీఆర్‌ఎస్‌లో చేరుతారా అన్నదానిపై కొంత సందిగ్థత నెలకొన్నప్పటికి సీఎం కెసిఆర్‌తో తన భర్త దివంగత మాజీ మంత్రి మాధవరెడ్డి హయాం నుండి కూడా ఉన్న పరిచయాల నేపధ్యంలో ఆమె టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. కేసీఆర్ సైతం ఉమా కాంగ్రెస్‌వైపు వెళ్లకుండా టీఆర్‌ఎస్‌లోకి వచ్చేలా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో జగదీశ్‌రెడ్డి వెంటనే ఉమా, సందీప్‌రెడ్డిలతో చర్చించి వారిని టీఆర్‌ఎస్‌లో చేరేలా ఒప్పించడంతో పాటు వారి చేరికను వ్యతిరేకించకుండా భువనగిరి నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో వారు మంగళవారం సీఎం కెసిఆర్‌తో మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో తనకు, తన కుమారుడికి భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల విషయంతో పాటు ఇతర పదవుల విషయమై చర్చించి కేసీఆర్ నుండి హామీలు పొందినట్లుగా ఉమా వర్గీయుల భోగట్టా. టీడీపీతో 33ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కారెక్కేందుకు సిద్ధమైన ఉమామాధవరెడ్డి కుటుంబం వెంట ఆ పార్టీ నుండి భారీగా టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ శ్రేణుల వలసలుంటాయని భావిస్తున్నారు. ఉమా చేరికతో టీఆర్‌ఎస్ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరింత బలపడనుండగా ఈ పరిణామాలు నియోజకవర్గ రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పులు తీసుకరానున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమా, సందీప్‌లకు సీఎం కెసిఆర్ టికెట్ ఇచ్చిన పక్షంలో సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని ఆలేరు లేదా ఉప్పల్‌కు మార్చవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.