నల్గొండ

చిన్నారికి విషమిచ్చి తానూ సేవించిన ప్రబుద్ధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపాలెం, జనవరి 2: మండలపరిధిలోని తమ్మారం గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణపాయస్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం మంగళవారం వేకువజామున గ్రామానికి చెందిన చిల్లా నర్సింహారావు, లావణ్య దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన నర్సింహారావు తన 13నెలల వయస్సున్న కుమార్తె నవ్యశ్రీని పాలులో విషం కలిపి పట్టించాడు. గమనించిన స్థానికులు పాపను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన అత్త అమేర లక్ష్మి కోపంతో అల్లుడిని దూషించింది. అత్త దూషించడాన్ని సహించలేని అల్లుడు నర్సింహారావు మరోమారు రెచ్చిపోయి బ్లేడ్‌తో అత్త లక్ష్మి గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయాలైన లక్ష్మిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు నర్సింహారావును అరెస్టుచేసేందుకు ప్రయత్నించగా అతను కూడా విషం సేవించినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అతన్ని కూడా పోలీసులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు చిచ్చురేపి 13నెలల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రాణపాయస్థితి చేర్చిన ఉదంతం గ్రామంలో విషాదం నింపింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చింతలపాలెం ఎస్‌ఐ పరమేశ్ తెలిపారు.

డీఈవోను కలిసిన ఆర్యవైశ్యులు
నల్లగొండ రూరల్, జనవరి 2: జిల్లా విద్యాశాఖాధికారి జైని చైతన్యకు నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామ మురళి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యా రంగంలో నల్లగొండ జిల్లాను అగ్రభాగంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు, నాంపల్లి నర్సింహా, నల్లగొండ అశోక్, కోటగిరి చంద్రశేఖర్, గోవింద్ బాలరాజు, నల్లగొండ శ్రీనివాస్, మిర్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.