నల్గొండ

శిశుగృహలో కలెక్టర్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 2: జిల్లా కేంద్రంలోని శిశుగృహను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐసిడిఎస్ పిడి పుష్పలత, వైద్యఆరోగ్య శాఖ అధికారి ఉమామహేశ్వరి, పిల్లల వైద్యులు శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన శిశుగృహను సందర్శించారు. సిబ్బంది శిశువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి వారి ఆరోగ్య పరిరక్షణ, పాలు పట్టడం వంటి అంశాలను సమీక్షించి పలు సూఛనలిచ్చారు. ఇటీవల శిశుగృహలో చిన్నారుల వరుస మరణాల నేపధ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
కాల్వలో..
విద్యార్థి గల్లంతు!
మిర్యాలగూడ టౌన్, జనవరి 2: మిర్యాలగూడ పట్టణంలోని అరవింద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న ఎండీ.అనస్(18) అనే విద్యార్ధి సోమవారం నాడు ఇంటి నుండి వెళ్లి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడి పోయాడని తెలిసింది. నూతన సంవత్సరం సందర్భంగా మిత్రులతో కలిసి వెళ్లిన అతను మిత్రులు ఇంటికి చేరగా అతను రాలేదు. కొంతమందిని విచారించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో విద్యార్ధి కనిపించడం లేదని తండ్రి అన్వర్ ఫిర్యాదు చేశారు. ఒన్‌టౌన్ పోలీసులు వేములపల్లి వెళ్లి విచారించగా కొంతమంది అనస్‌ను వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ కాల్వలో తోసేశారని, చెప్పకుండా జారుకున్నారని తెలిసింది. అన్వర్ నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన వాడు. అతను 20 సంవత్సరాల నుండి మిర్యాలగూడలోనే ఉంటున్నాడు. సోమారం గ్రామంలో భూతగాదాలున్నాయని, ఇయనకు వ్యతిరేకులు అతని అబ్బాయిని కాల్వలో పడేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు అనస్ మిత్రులను ప్రశ్నిస్తున్నారు. కాల్వలో గల్లంతైన అనస్ మృతదేహం కోసం సోమవారం సాయంత్రం నుండి గాలిస్తునే ఉన్నారు. నేటి వరకు లభ్యం కాలేదు.

రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్
* రేషన్ డీలర్లకు ఈపాస్ యంత్రాలు * కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడి

నల్లగొండ, జనవరి 2: రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టి సరుకుల పంపిణీ పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రభుత్వం డీలర్లకు ఈపాస్ యంత్రాల పంపిణీ చేపట్టిందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం కలెక్టర్‌లో రేషన్ డీలర్లకు ఈపాస్ యంత్రాల నిర్వాహణపై ఏర్పాటు చేసిన నాలుగు రోజుల అవగాహాన సదస్సులో ఆయన మాట్లాడుతు నిత్యావసర పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు డీలర్లకు ప్రభుత్వం ఈపాస్ యంత్రాలు మంజూరు చేసిందన్నారు. రేషన్ సరుకులు గోదాంల నుండి డీలర్లకు చేర్చి వినియోగదారులకు పంపిణీ చేసే క్రమంలో అవకతవకలు తలెత్తకుండా ఈపాస్ సిస్టమ్ ఉపకరిస్తుందన్నారు. డీలర్లు ఈపాస్ యంత్రాల వినియోగంలో మెళకువలను తెలుసుకుని సరుకుల పంపిణీ సకాలంలో సాగించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ డీలర్‌కు ఈపాస్ యంత్రాన్ని అందిస్తున్నామన్నారు. వచ్చే నెల నుండి ఈపాస్ యంత్రాలను వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా డీలర్లకు హైద్రాబాద్ బృందం ఈపాస్ యంత్రాల వినియోగంపై అవగాహాన కల్పించారు. అనంతరం తొలి రోజు హాజరైన డీలర్లకు ఈపాస్ యంత్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో డిఎస్‌వో ఉదయ్‌కుమార్‌తో పాటు వివిధ మండలాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

సాగర్ నీటితో చెరువులు నింపాలి
* చివరి భూములకు నీరందించాలి * మాజీ శాసన సభ్యుడు రంగారెడ్డి
మిర్యాలగూడ టౌన్, జనవరి 2: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టులోని చెరువులను నింపాలని అదే విధంగా కాల్వ చివరి భూములకు నీరందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని రుద్రారం చెరువును ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయా వాగుల ద్వారా ఎల్లప్పుడు నిండే రుద్రారం చెరువులో నేడు నీళ్లు లేవన్నారు. దీంతో 9 గ్రామాల రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్తున్నారన్నారు. ఇదే పరిస్థితి రాయినిపాలెం, కొత్తపేట, కేశవపురం, జాలుబాయితండా, ములకలకాల్వ తదితర గ్రామాలకు సాగర్ కాల్వ నీరందడం లేదన్నారు. ఇలా అనేక గ్రామాలున్నాయన్నారు. దామరచర్ల, వేములపల్లి మండలాల్లోని పొలాలు నీరందక ఎండిపోతున్నాయన్నారు. అన్ని చెరువులు, అన్ని మేజర్ కాల్వల చివరి భూములకు నీటితో నింపాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.మల్లేష్, వి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ పి.విజయలక్ష్మి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, దేవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లింగయ్య, శ్రీనివాస్, నాగునాయక్, గోపరాజు, సత్యంలు పాల్గొన్నారు.

సీఎం కేసిఆర్‌కు జిల్లా మంత్రి..ఎమ్మెల్యేల
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

నల్లగొండ, జనవరి 2: నూతన సంవత్సరం 2018పురస్కరించుకుని జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మంగళవారం సీఎం కెసిఆర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్సీలు ఎ.కృష్ణారెడ్డి, పూల రవిందర్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, ఆర్. రవీంద్రకుమార్, ఎన్.్భస్కర్‌రావు, నియోయోజకవర్గ ఇన్‌చార్జిలు కాసోజు శంకరమ్మ, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నరసింహాయ్య, కన్మంత్‌రెడ్డిశశిధర్‌రెడ్డి, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి సీఎంను కలిశారు.
అంధుల పాఠశాలకు ఎన్‌ఆర్‌ఐ వితరణ
నల్లగొండ టౌన్, జనవరి 2: పట్టణంలోని అంధుల పాఠశాల డ్వాబ్‌కు ఎన్‌ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, సునీతారెడ్డిలు లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డ్వాబ్ నిర్వాహకులు చొక్కారావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రావు, ఏవో చంద్రశేఖర్, ఇతర సిబ్బంది ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు శ్రీహరిరెడ్డి, సునీతారెడ్డి మాట్లాడుతూ అంధుల పాఠశాలకు విరాళం అందించడం ఆనందంగా ఉందని, పాఠశాల విద్యార్థుల బాగోగులకై తమ వంతు సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి హాజరై దాతలను సన్మానించారు.