నల్గొండ

అమెరికా పరిజ్ఞానంతో తెలంగాణలో సేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 30: తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధికి అమెరికాలో పంటల సాగులో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను వినియోగించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కాలిఫోర్నియాలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అక్కడి రైతులు పంటల సాగులో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను, సాగు పరికరాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో వాటి వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఆయన స్థానిక వ్యవసాయ రంగ నిపుణలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భూములు, వర్షాభావ పరిస్థితులను వారికి వివరించి అమెరికా వ్యవసాయ పరిజ్ఞానం ఏ మేరకు తెలంగాణ రైతులకు ప్రయోజనకంగా ఉంటుందంటు వివరాలు అడిగారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను గడిస్తున్న అక్కడి రైతుల అనుభవాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆమెరికా సాగు పద్ధతులు తెలంగాణ వ్యవసాయ రంగానికి అన్వయిస్తే సీఎం కెసిఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ సాకరం మరింత సులభతరమవుతుందన్నారు. మంత్రి వెంట అమెరికా తెలంగాణ తెలుగు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన నంద్యాల దయాకర్‌రెడ్డిలు ఉన్నారు.
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్ధేందుకు సీఎం కెసిఆర్ చేస్తున్న కృషిలో అమెరికా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం తన అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో అమెరికా తెలంగాణ తెలుగు సంఘం నిర్వహించిన తెలంగాణ తెలుగు ఫెస్టివల్, టిఆర్‌ఎస్ అవిర్భావ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే ఆదర్శనీయ రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో వేగంగా పురోగమిస్తుందన్నారు. రాష్ట్ర ప్రగతిలో టి.ఎన్‌ఆర్‌ఐలు తమవంతు తోడ్పాటునందించాలన్నారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ తెలుగు సంఘం సభ్యులు పూర్ణ చందర్, జలగం నవీన్, రంగినేని అభిలాష్, పొన్నాల శ్రీని, రజనికాంత్, భాస్కర్, యశ్వంత్‌లు పాల్గొన్నారు.