నల్గొండ

కరవు జిల్లాగా ప్రకటించాలి:టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి/నాంపల్లి/చింతపల్లి/గుర్రంపోడు, ఏప్రిల్ 30: నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలను కలిపి కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు హరికెల నర్సిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు. శనివారం తెలుగుదేశం నాయకులు వివిధ మండలాలలో పర్యటించి జిల్లా కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 22మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. కానీ జిల్లా అంతటా కరవు కరాళ నృత్యం చేస్తుందని వెంటనే మిగతా 37మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలన్నారు. కరువు భారిన పడి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికినీ ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కెసిఆర్ కలల ప్రపంచాన్ని ప్రజల ముందుంచి మాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి, ఇతర పంటల నష్టపరిహార నిమిత్తం ప్రతి రైతుకు ఎకరాకు 25వేల ఎక్స్‌గ్రేషియా, తోటలు నష్టపోయిన వారికి 50వేల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జిల్లాలో నెలకొన్న కరువుపై తహశీల్ధార్, మండల అభివృద్ధి అధికారిలతోని సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని, ఆ వివరాలతో నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటికి కూడా టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కరువు మండలాల్లో పర్యటించక పోవడం దారుణమన్నారు. వెంటనే అన్ని విషయాలను సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున కరువు సహాయాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షులు బిల్యానాయక్, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, మధు, పిల్లి రామరాజు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వం
నాంపల్లి: జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్లు ఉండి కూడా రైతులు, ప్రజల గోస పట్టించుకోని గుడ్డి ప్రభుత్వమని, కేవలం మాటలకే పరిమితమైన చేతగాని ప్రభుత్వమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహ్ములు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్, టిడిపి బృందం ద్వజమెత్తారు. శనివారం టిడిపి పర్యటనలో భాగంగా నాంపల్లిలో ఎండిపోయిన బత్తాయి, వరి చేలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు కరువుతో అల్లాడుతున్నా మాయ మాటలు చెప్పి రైతులను, ప్రజలను మోసం చేస్తుందన్నారు.
ఒక వైపు మండే ఎండలు, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి రైతుల పరిస్థి దయనీయంగా మారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కెసి ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు, వర్షాలు లేక, పశువులకు పశు గ్రాసంలేక మూగ జీవాలు అల్లాడుతున్నాయని ఆరోపించారు. ఫామ్‌హౌజ్‌లో ఉండకుండా ఎండల్లో తిరిగితే కరువు పరిస్థి తెలుస్తుందని, మరో వైపు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. పల్లెల్లో నీరు లేక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా టిఆర్‌ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు చలనం లేదని ఆరోపించారు. ఇప్పుడు నీరు లేవంటే ఇంటింటించి నీరిస్తామని చెప్పి ప్రజలన మోసం చేస్తుందన్నారు. ముఖ్యంగా పత్తి, వరి, సజ్జ, జొన్న పంటలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25వేలు, బత్తాయి, మామిడి తోటలకు ఎకరాకు 50వేలు అందించాలని డిమాండ్ చేశారు. నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వంపై కరువు సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని వారు పేర్కొన్నారు.
70 ఎంఎం సినిమా చూపిస్తున్న కెసిఆర్
చింతపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటల గారడి, అంకెల గారడితో జిమ్మిక్కులు చేస్తూ కెసిఆర్ 70ఎంఎం సినిమా చూపిస్తున్నారని తెలుగుదేశం కరువు బృందం సభ్యులు హరికల నర్సారెడ్డి, మోత్కుపల్లి నర్సింహ్ములు ఆరోపించారు. మండల కేంద్రంలోని కరవుతో ఎండిపోయిన మామిడితోట, బత్తాయితోట, కూరగాయల తోటలను శనివారం ఆయన పరిశీలించారు. వడదెబ్బతో మృతి చెందిన 250మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల చొప్పున, తొటలకు ఎకరాకు 50వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.
కరవు మండలంగా ప్రకటించాలి
గుర్రంపోడ్: రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై టిడిపి రాష్ట్ర బృందం శనివారం మండలంలోని పోచంపల్లి, జూనూతల, కాసారం గ్రామాలలో పర్యటించింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మోత్కుపల్లి నర్సింహ్ములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనప్పటికి ప్రజలకు ఎలాంటి పథకాలను అమలు చేలేదని, జిల్లాలో 22మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికి ఎలాంటి కరువు సహాయక చర్యలు అందించలేదన్నారు. గుర్రంపోడుతో సహా అన్ని మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు.