నల్గొండ

న్యాయం, ధర్మం పనిచేస్తే పాలేరులో కాంగ్రెస్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం పనిచేస్తే కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి, డబ్బులు వెదజల్లి పాలేరు ఎన్నికల్లో గెలిచేందుకు తెరాస ప్రయత్నిస్తున్నదని కాని చైతన్యవంతులైన పాలేరు ప్రజలు ఈ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ తెచ్చి అన్నం పెట్టిన సోనియమ్మకు కెసిఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కలెక్టర్‌ల సమావేశం ఆలస్యంగా నిర్వహించి సమీక్ష చేయడం ప్రభుత్వ చిత్తశుద్దిని వెల్లడిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, కరువు సహాయకచర్యలు, కూలీలకు పనులు, పశువులకు పశుగ్రాసాన్ని అందించడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. కూలీలు పనులు లేక వలసలు వెళుతున్నారని, పశుగ్రాసం లేక పశువులను రైతులు కబేళాలకు తరలిస్తున్నారని, వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 59 మండలాలకు 22 మండలాలనే కరువుమండలాలుగా ప్రకటించారని జిల్లా మొత్తాన్ని కరువుజిల్లాగా ప్రకటించి వెంటనే సహాయచర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌కు ఫిరాయింపులపై వున్న శ్రద్ద ప్రజలు, ప్రజాసమస్యలపై లేదని ఆయన ద్వజమెత్తారు. కెసిఆర్‌కు సీట్ల కరువుపట్టి కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులను గుంజుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు కరువుతో తిండిలేక అల్లాడుతుంటే ప్లీనరీ పేరుతో తెరాస నాయకులకు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకం కాదని ప్రాజెక్ట్‌ల్లోని అవినీతికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు నెలల తరబడి పెండింగ్‌లో వున్న బిల్లులను వెంటనే ఇవ్వాలని, మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యాసంస్ధలపై విజిలెన్స్ దాడులు చేయించి విద్యార్ధులకు తెరాస అన్యాయం చేస్తున్నదని గుత్తా చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, పైడిమర్రి సత్యబాబు, వంగవేటి రామారావు, మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్ కుడుముల లక్ష్మినారాయణ, నాయకులు షమ్మి, వంగవేటి శ్రీనివాస్, మాతంగి బసవయ్య, గాలి శ్రీనివాస్, ధనమూర్తి, కోటేశ్వర్‌రావు, రహీమ్, కొండల్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.