నల్గొండ

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, ఏప్రిల్ 30: నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి గ్రామసమీపంలోని మూసినది వంతెనపై ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో బోల్తాపడి యాదగిరిపల్లికి చెందిన నేరెళ్ల నాగరాజు(19) మృతిచెందగా గువ్వల నాగేందర్(20)కు తీవ్రగాయాలైనాయి. నేరేడుచర్ల ఎఎస్‌ఐ సాగర్‌రావు వివరాల ప్రకారం మిర్యాలగూడ నుండి హుజూర్‌నగర్‌కు వెళ్తున్న ఎపి 24పిబి19 గల లారీ గడ్డిపల్లి నుండి యాదగిరిపల్లికి వెళ్తున్న ఆటోను చిల్లెపల్లి మూసినది వంతెనపై ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లికి చెందిన నేరేళ్ల నాగరాజు అతని స్నేహితులు గువ్వల నాగేందర్, రఫిలు కలిసి నాగరాజు సొంత అక్క పెళ్లి గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జరగడంతో అక్కడికి వెళ్లారు. వివాహం అనంతరం తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నాగరాజు, నాగేందర్‌కు తీవ్రగాయాలైనాయి.