నల్గొండ

నల్లగొండ మున్సిపల్ రికార్డుల స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 3: నల్లగొండ మున్సిపాల్టీలో జరుగుతున్న వరుస అక్రమాలు, రికార్డులు, పన్ను వసూళ్ల రశీద్ పుస్తకాల మాయం విచారణ నేపధ్యంలో సిసిఎస్ పోలీసులు మంగళవారం మున్సిపాల్టీలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాములు నేతృత్వంలోని విచారణ బృందం రికార్డు పుస్తకాలను, రశీద్ పుస్తకాలన్నింటిని స్వాధీనం చేసుకుని వ్యాన్‌లో తరలించుకుపోయారు. ఇప్పటికే కోట్ల రూపాయల అస్తిపన్ను స్వాహా పర్వంలో రికార్డుల మాయంలో, నకిలీ రశీద్‌ల వ్యవహారంలో 22మంది సిబ్బందిపై గతంలో వేటు వేశారు. అయితే వారిలో కొంత మంది తిరిగి విధుల్లో చేరారు. మళ్లీ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో సిసిఎస్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.