నల్గొండ

విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, ఏప్రిల్ 17: విధులలో అలసత్వం వహించి, ఫ్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే అంలాటి అధికారులను ఉపేక్షించేదిలేదని స్ర్తిశిశు సంక్షేమశాఖ ఆర్‌వో మల్లెపల్లి సువర్ణారెడ్డి హెచ్చరించారు. రామన్నపేట ఐసిడిఎస్ పరిధిలోని చౌటుప్పల్, రామన్నపేట మండలాలలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రంలోని సిడిపివో కార్యాలయాన్ని సందర్శించి అధికారుల పనితీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిడిపివో ఆర్‌జెడి కార్యాలయంలో శిక్షణకు వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్ సెలవులలో ఉన్నారు. కార్యాలయంలో స్టాక్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి సంబంధించిన తాళాలు సైతం సెలవులోఉన్న వ్యక్తి వద్ద ఉండటం పట్ల ఆమె తీవ్ర అసహనంత వ్యక్తం చేశారు. సెలవులోఉన్న సీనియర్ అసిస్టెంట్‌ను పోన్‌ద్వారా వివరాలు అడుగగా గత డిసెంబర్ నుండి రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదని తెలపడంతో ఆమె నివ్వేరపోయారు. రామన్నపేట ప్రాజెక్టు అధికారుల పనితీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె తెలిపారు.

అసిఫా హంతకులను శిక్షించాలి
* జమైత్ ఈ ఇస్లామి హింద్ తెలంగాణ ఒరిస్సా జోన్ అధ్యక్షుడి డిమాండ్

రామగిరి, ఏప్రిల్ 17: జమ్మూకాశ్మీర్‌లో దారుణంగా హత్యకు గురైన అసిఫా నిందితులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని జమైత్ ఈ ఇస్లామి హింద్ తెలంగాణ ఒడిస్సా జోన్ అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్ డిమండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతు కేంద్రంలోని బిజెపి ఎన్‌డిఏ పాలనలో దేశంలో మైనార్టీలు, దళితులపై, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయానన్నారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. దేశంలో అత్యాచార, హత్యలను నియంత్రించే చట్టాలను మరింత కఠిన తరం చేయాలని, ఇస్లామిక్ దేశాల మాదిరిగా వెంటనే శిక్షలు అమలు చేసేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మేకిన్ ఇండియా మోదీ పాలనపై ఫేక్ ఇండియాగా, రేప్ ఇండియాగా మారిపోతుందని, ప్రధానీ మోద పాలనపై అపనమ్మకం పెరిగిపోతుందన్నారు. నేరాలు, ఘోరాలకు బలైపోయిన ఘటనల్లో నిందితులు ఎవరైన వారికి శిక్షలు, బాధితులకు న్యాయం అందించాల్సిన బాధ్యత రాజ్యంగ బద్ధ ప్రభుత్వాలకు ఉందన్నారు. మతోన్మాద కోణంలో నేరాలను చూడటం, ప్రేరేపించడం ఏ మతం సహించబోదన్నారు. మక్కామసీద్ పేలుళ్లలో సైతం నిందితులకు శిక్షలు పడకపోవడం రాజ్యంగ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. ముస్లింలలో సైతం మతోన్మాదులు ఉండవచ్చని అలాగని అందరిని అదే దృష్టితో చూడరాదన్నారు. 2014ఎన్నికల్లో చెప్పిన మోదీ ఎజెండా పూర్తిగా నిర్వీర్యమైందని, బ్యాంకులను ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో సంస్థ నాయకులు షేక్ అబ్ధుల్ గఫార్, సయ్యద్ అబ్ధుల్ అహ్మద్ సహేల్, ఖాజా జహీరుద్ధిన్, యూసఫ్ సయ్యద్ పాల్గొన్నారు.