నల్గొండ

పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 18: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం శివారులోని జమునానగర్‌లో రూ.2.62కోట్లతో నిర్మించే 52 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయని అయిన్నప్పటికీ త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ యాకుబ్, డీఈ మహిపాల్‌రెడ్డి, కాసరబాద సర్పంచ్ సరిత, ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డీనేటర్ కక్కిరేణి నాగయ్య, జిల్లా డైరెక్టర్ మాలి కవిత, ఎంపీడీవో నాగిరెడ్డి, తహశీల్థార్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇక తహశీల్‌లో రిజిస్ట్రేషన్లు
కట్టంగూర్, మే 18: ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ విధానం అమలు కోసం తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక తహశీల్ధార్ కార్యాలయాన్ని ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టులో నిర్వహణలో ఎదురయ్యే లోపాలను గుర్తించి ఆతర్వాత అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు విస్తరించనున్నారు. నల్లగొండ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కట్టంగూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం నుంచి ఈసేవలను ప్రారంభం కానున్నాయి. తహశీల్దార్‌లకే సబ్ రిజిష్టర్ బాధ్యతలను అప్పగించారు. ఇందుకోసం కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు గాను అదనంగా మూడు నూతన కంప్యూటర్‌లను ఏర్పాటుచేశారు. భూముల క్రయవిక్రయాలను ఎప్పటికప్పుడు అఫ్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌కు మరో కంప్యూటర్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా అన్ని రిజిస్ట్రేషన్ కార్యకాలపాలను సీసీ రికార్డు చేసేందుకు గాను సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ టీవీని ఏర్పాటుచేశారు. స్కానర్‌లు, ప్రింటర్‌లు బిగించారు. కంప్యూటర్‌లు అన్నింటిని రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానం చేస్తూ హైస్పీడ్ ఇంటర్నేట్‌ను సదుపాయం కల్పించారు. తహశీల్దార్ కార్యాలయ సిబ్బందితో పాటు పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్‌ల శాఖకు సంబంధించిన సిబ్బందిని నియమించారు. శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును పూర్తిచేసి శనివారం నుండి సేవలను ప్రారంభించేందుకు సర్వం సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా రిజిష్టర్ బి.ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ప్రయోగాత్మంగా అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. మండలకేంద్రల్లో ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రజలకు మరింత సులువుగా స్ధానికంగానే తమ శాఖ సేవలు అందే అవకాశం కలుగుతుందన్నారు.
ప్రజలు సేవలు వినియోగించుకోవాలి
* తహశీల్దార్ తిరందాసు వెంకటేశం
మండల కేంద్రాల్లోనే ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను అందించే లక్ష్యంతో స్ధానిక కార్యాలయంలో ప్రారంభించే సేవలను మండల ప్రజలు వినియోగించుకోవాలి. ఇప్పటికే రెవెన్యూశాఖపై పనిభారం అధికంగా ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్‌లుగా అదనంగా అప్పగించే బాధ్యతలను కూడ సక్రమంగా నిర్వర్తిస్తాం. ప్రయోగాత్మక పథకానికి కట్టంగూర్ మండలం ఎంపిక చేయడంతో విజయవంతంగా అమలు చేసేందుకు పకడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాం. శనివారం నుంచి మండల ప్రజలకు రిజిస్ట్రేషన్‌ల కోసం నకిరేకల్‌కు వెళ్లకుండా ఇక్కడే చేయించుకోవచ్చు.