నల్గొండ

కరవు సహాయంతో రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 10: రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు సమస్యను పరిష్కరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం పల్లా నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన మగ్దూం భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడి కరువు సమస్యను ముందస్తు అంచనాలు లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలపడంలో తీవ్ర ఆలస్యం చేయడం వల్ల కరువు సహాయక నిధుల విడుదలలో జాప్యం జరిగిందని, తద్వార రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నివేధికలు అందజేసినప్పటికి ప్రభుత్వం దాటవేద వైఖరితో ప్రజలు కరువు బారిన పడి వలసలు పెరిగి పోతున్నాయన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కెసిఆర్ కాలయాపన చేస్తూ అవినీతికి పాల్పడే విధానాలకు ఆస్కారమిస్తున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులను నిలిపివేయాలని చంద్రబాబు లేఖ రాయడం సరైంది కాదని, అంతర్రాష్ట్ర జల వివాధాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకునేందుకు చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపధికన చేపట్టి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరముందని సూచించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ దాటవేత వైఖరి సరికాదని సిపిఐ శాసనసభాపక్ష నాయకులు రవీంద్రకుమార్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రమీల కుంటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగల్ల వానలవల్ల పండ్ల తోటలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడదెబ్బకు మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకొని వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఇజ్జిని యాదగిరిరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోదా శ్రీరాములు, నెల్లికంటి సత్యం, పల్లా దేవేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు, గన్న చంద్రశేఖర్, దామోదర్‌డ్డి, ఎల్,శ్రవణ్, కలకొండ కాంతయ్య, వి.సృజన, జిల్లా సమితీ సభ్యులు పాల్గొన్నారు.