నల్గొండ

పార్టీ బలోపేతానికే నియోజకవర్గ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
నల్లగొండ, జూలై 14: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి క్యాడర్‌ను ఒక్కత్రాటిపైకి తెచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు, రేపు నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో పిసిసి కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జులైన వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, వినోద్‌రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశాల నిర్వాహణ వివరాలను వెల్లడించారు. నేడు నల్లగొండలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో నల్లగొండ పార్లమెంట్ సమావేశం, రేపు భువనగిరిలోని ధనలక్ష్మి గార్డెన్‌లో భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశాలు ఏఐసిసి కార్యదర్శి ఎండి.సలీమ్ ఆహ్మద్ పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ పార్టీగా, కెసిఆర్ ఇచ్చిన ఎన్నికల హామీల ఆకర్షణతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల హామీల అమలును విస్మరించి మాయమాటలతో మోసపూరిత పథకాలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కెజి టూ పిజి ఉచిత విద్య, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల హామీల అమలులో విఫలమైందన్నారు. రైతుబంధు పథకం చెక్కులు, పాస్ పుస్తకాల తప్పులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భూరికార్డుల్లో తప్పులను సవరించేందుకు రెవెన్యూ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు ఒక్కటై రైతుల నుండి లంచాలు దండుకుంటున్నారన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ధరకు అదనంగా 500రూపాయలు కూడా ఇవ్వలేదని, రైతు చస్తే రైతుబీమా అంటున్న కెసిఆర్ ప్రభుత్వం రైతు బతికేందుకు పంటలకు బీమా లేకుండా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ, పంటలకు మద్ధతు ధర పెంపు, నిరుద్యోగులకు భృతి వంటి పథకాలు అమలు చేయనుందన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు, కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం, క్యాడర్‌ను కదిలించడం వంటి అంశాలను పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో చర్చించనున్నట్లుగా తెలిపారు. సమావేశాల్లో పార్టీ అభ్యర్థులపై అభిప్రాయ సేకరణలు వంటి అంశాలు ఉండవని, కేవలం సంస్థాగత నిర్మాణం, బూత్, బ్లాక్ కమిటీల ఏర్పాటు, శక్తియాప్‌ల ఎన్‌రోల్‌మెంట్‌లపై మాత్రమే చర్చలు ఉంటాయన్నారు. నేడు నల్లగొండలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించే నల్గగొండ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభంకానుందన్నారు. అనంతరం ఈ పార్లమెంట్ పరిధిలోని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం సమీక్ష సమావేశం మధ్యాహ్నం 1నుండి 2గంటల వరకు, సూర్యాపేట నియోజకవర్గం సమావేశం 2నుండి 3గంటల వరకు, కోదాడ నియోజకవర్గం సమావేశం 3నుండి 4గంటల వరకు, హుజూర్‌నగర్ నియోజకవర్గం సమావేశం 4నుండి 5గంటల వరకు, నాగార్జున సాగర్ నియోజకవర్గ సమావేశం 5నుండి 6గంటల వరకు, మిర్యాలగూడ నియోజకవర్గం సమావేశం 6నుండి 7గంటల వరకు, దేవరకొండ నియోజకవర్గం సమావేశం రాత్రి 7నుండి 8గంటల వరకు కొనసాగుతాయన్నారు. రేపు భువనగిరిలో జరిగే ఈ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం సైతం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 1నుండి 2గంటల వరకు తుంగతుర్తి నియోజకవర్గం సమీక్షా సమావేశం, 2నుండి 3గంటల వరకు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 3నుండి 4గంటల వరకు ఆలేరు, 4నుండి 5గంటల వరకు నకిరేకల్, 5నుండి 6గంటల వరకు మునుగోడు, 6నుండి 7గంటల వరకు జనగామా, 7నుండి 8గంటల వరకు ఇబ్రహీమ్‌పట్నం నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరుగుతాయన్నారు. ఆయా సమావేశాలకు నియోజకవర్గాలకు చెందిన బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సహకార సంఘాల చైర్మన్లు, జడ్పీటీసిలు, ఎంపిటీసిలు, సర్పచ్‌లు, పార్టీ అనుబంధ మండల, బ్లాక్ కమిటీల నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.