నల్గొండ

యాదాద్రిలో వైభవంగా నిత్యరాధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 19: యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో నిత్యారాధనలు, ఆర్జీత సేవలు బుధవారం శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కోలిపి బిందె తీర్థం, బాలబోగంలతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ప్రతిష్టమూర్తులను పంచామృతాభిషేకాలు నిర్వహించి ఆరాధించారు. దర్శనామూర్తులను స్వర్ణపుష్పాలతో అర్చించి ఆరాధించారు. మహామండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, పంచారాత్రాగమశాస్త్రానుసారం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అత్యంత సుందరంగా అలంకరించి గజవాహన సేవోత్సవం నిర్వహించి నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్రగమశాస్త్రానుసారం నిర్వహించారు. భక్తులు నిత్య కల్యాణోత్సవంలో, ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అష్టోత్తర నామార్చనలు, సహస్రనామార్చనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండి జోడి సేవ నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు.

ప్రణయ్ హంతకులకు ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 19: మిర్యాలగూడ పట్టణంలో పట్టపగలు కుల, ధన దురహంకారంతో అనాగరికంగా దళిత యువకుడు ప్రణయ్‌కుమార్‌ను హతమార్చిన దుండగులను నిర్భయ కంటే తీవ్రాతితీవ్ర చట్టం ద్వారా ఉరిశిక్ష విధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడకు వచ్చి ప్రణయ్‌కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అక్రమార్జన ద్వారా ధనికుడైన మారుతిరావు ఆలోచనలు కూడా అలాగనే ఉండటం వల్ల తన అల్లుడినే దారుణంగా చంపించాడని ఆరోపించారు. పోలీసులు ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా హత్య కేసులో విచారణ జరపాలని నిందితులందరికి ఉరిపడేలా చేయాలని కోరారు. విచారణపై అనుమానాలు వస్తున్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల అండ ఉండటం వల్లనే పూర్తి స్థాయిలో మారుతిరావు పెట్రేగిపోయాడన్నారు. ప్రణయ్‌కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటంలో తమ పార్టీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, పార్టీ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సమీఖాద్రి, కాంతయ్య, సయిద్, జిల్లా యాదగిరి, డి.లింగానాయక్, పరంగిరాము, బిల్లా కనకయ్య, పద్మ, సులోచనలున్నారు.