నల్గొండ

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 20: జిల్లా కేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాం త వాతావరణంలో నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిమజ్జనం చేసే సద్దల చెరువును మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉత్సవ కమిటీల వారు పోలీస్ శాఖ సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం పూర్తిచేసేందుకు సహకరించాలని కోరారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 300 విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖతో పాటు రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు.
సద్దలచెరువు వద్ద బారీకేడ్లు నిర్మించడంతోపాటు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీలు డీజేలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిమజ్జనం సందర్భంగా డప్పు వాయిద్యాలను వినియోగించాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక మాట్లాడుతూ నిమజ్జనానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అనంతుల కృపాకర్, రంగరాజు రుక్మారావు, సభ్యులు చలమల్ల నర్సింహా, దంతాల రాంబాబు, తోట శ్యాంప్రసాద్, కునుకుంట్ల శారదాదేవి, షఫీ ఉల్లా, రహీం, గుణగంటి వంశీ, బూర బాలసైదులు, వెలుగు వెంకన్న, మున్సిపల్ కమిషనర్ శంకర్, టౌన్ సీఐ శివశంకర్, తండు శ్రీను, గండూరి ప్రకాష్, కృపాకర్‌లతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యారాధనలు, ఆర్జిత సేవలు, లక్షపుష్పార్చనలు నిత్య కల్యాణం శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువ జా మున స్వామిఅమ్మవార్లను సుప్రభాతంతో మేల్కొలిపి ఆరతి నివేధన చేసి, బిందెతీర్థం, బాలభోగంతో నిత్యకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు జరిపి అత్యంత సుందరంగా అలంకరించారు. తులసీదళాలతో అర్చించారు. దర్శనమూర్తులను స్వర్ణ పుష్పాలతో కొలిచారు. మహామండపంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గజవాహనసేవ నిర్వహించి నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్రగమశాస్త్రానుసారం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం కార్యక్రమాలు శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవంలో, అష్టోత్తర, సహస్రనామార్చన పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండి జోడి సేవ నిర్వహించారు. కాగా, స్వామి వారికి హైద్రాబాద్‌కు చెందిన నెల్లుట్ల రామకిషన్‌రావు, వసంతకుమారి దంపతులు రూ. లక్షా 881ల విలువైన రెండు కిలోల 450 గ్రాముల వెండి రెండుబిందెలు, కలశం, చెంబు, రెండు తీర్థచెంచాలు బహూకరించారు.

ప్రభుత్వ అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి
* టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతా రెడ్డి
ఆలేరు, సెప్టెంబర్ 20: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాకలో భారీ ర్యాలీ, కోలాటాలు, డప్పు కళాకారుల నృత్యాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించి పలు పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేరుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత నిరంతర విద్యుత్ వంటి పథకాలు దేశంలోనే ఆదర్శనీయంగా సాగుతున్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని ముందేన్నడు లేనంత రీతిలో అభివృద్ధి చేశామన్నారు. కొలనుపాక గ్రామానికి రూ.85లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని తన గెలుపు తధ్యమన్నారు. గెలిచిన వెంటనే ఆలేరుకు గంధమల్ల రిజర్వాయర్ ద్వారా గోదావరి అందిస్తామన్నారు. కార్యక్రమంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు ఆకవరపు మోహన్‌రావు, గ్రామశాఖ అధ్యక్షుడు గాదే సోమిరెడ్డి, నాయకులు మామిడాల అంజయ్య, మురళీ పాల్గొన్నారు.