నల్గొండ

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 20: అధికారమే పరమావధిగా సిద్ధాంతాలను విస్మరించి అపవిత్ర పొత్తులతో మహాకూటమి పేరుతో విపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పెన్‌పహాడ్ మండలం అనంతారంలో గురువారం నిర్వహించిన టీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లపాటు ఉద్యమాలు కొనసాగించి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పాలనసాగించి నాలుగున్నరేళ్లలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. విపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారం కోసం కూటమి పేరుతో జత కట్టడాన్ని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసగించేందుకు వస్తున్న చీకటి దొంగలకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలంతా మరోసారి టీఆర్‌ఎస్‌కే అధికారం కట్టపెట్టేందుకే సిద్ధంగా ఉన్నారన్నారు. సూర్యాపేటలో తన గెలుపు ఖాయమని, అత్యధిక మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో గతంలో అధికారంలో ఉన్న నేతలు అనేక అక్రమ దందాలకు పాల్పడటంతోపాటు అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. తాము గెలిచిన తర్వాత అలాంటి దందాలకు ఆటకట్టించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు, నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో రోడ్డుకెక్కిన గ్రూప్ తగాదాలు
* శంకరమ్మ, సైదిరెడ్డి వర్గాల పోటాపోటీ ర్యాలీలు
* నాలుగు వర్గాలుగా విడిపోయన శ్రేణులు
* రసకందాయంలో హుజూర్‌నగర్ రాజకీయం
హుజూర్‌నగర్, సెప్టెంబర్ 20: పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలోని 4 గ్రూప్‌లు టికెటుకు గత 10 రోజులుగా రోడ్డుకెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఓడించి ఆయన నోరు మూయించాలని చేస్తున్న విశ్వప్రయత్నాలు ఆదిలోనే హంసపాదుగా మారాయి. 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన దివంగత శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టికెట్ తనకే ఇవ్వాలని గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఉండి కార్యకర్తలకు, ప్రజలకు సేవలు అందిస్తున్నానని, 1000 మంది అమరులలో ఒక్క కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? అని నిలదీస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, అంకిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శానంపూడి సైదిరెడ్డి టీఆర్‌ఎస్ టికెట్ తనకే ఇవ్వాలని గత 35 సంవత్సరాలుగా రాజకీయ కుటుంబంలో ఉండి ప్రజలకు, యువతకు అనేక సేవలు చేశామని అంటున్నారు. ఒక రోజు సైదిరెడ్డి టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తే మరుసటి రోజు శంకరమ్మ మోటారు సైకిల్ ర్యాలీ పోటీగా నిర్వహిస్తున్నారు. శంకరమ్మ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తే సైదిరెడ్డి స్వర్ణ వేదిక ఫంక్షన్‌లో నియోజకవర్గ సమావేశం పోటీగా నిర్వహించారు. ఇరు వర్గాల వారు సమావేశాలలో, ప్రెస్‌మీట్‌లలో దూషణలతో కత్తులు దూసుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు తనకు టికెట్ ఖాయం చేశారని సైదిరెడ్డి చెబుతుండగా, తనకే టికెట్ ఇస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారని శంకరమ్మ అంటున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ టీఆర్‌ఎస్ నాయకుడు సాముల శివారెడ్డి గత 10 రోజులుగా హైద్రాబాద్‌లోనే మకాం వేసి టీఆర్‌ఎస్ టికెట్ తనకే వస్తుందని గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు బహిరంగ సభలో ఇచ్చిన హామీ ఈసారి అమలు చేస్తామని తనకు వాగ్ధానం చేశారని చెబుతున్నారు. ఇక నాలుగో గ్రూప్‌కు చెందిన ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి టికెట్ తనకే ఖాయమైందని మంత్రి జగదీశ్‌రెడ్డి అండదండలతో పోటీ చేసి గులాబీ జెండా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎగుర వేస్తానని అంటున్నారు. తొలుత హుజూర్‌నగర్ నుండి నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కేసీఆర్ రంగంలోకి దింపుతున్నారని వార్తలు వచ్చినా ఆయన సుముఖంగా లేరని సమాచారం. మరోవైపు మై హోం సిమెంట్స్ అధినేత రామేశ్వరరావు కూడా పోటీ చేయటానికి విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం టీఆర్‌ఎస్ నుండి ఎవరు పోటీ చేసినా తమ ఉత్తమ్ గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే మొదటి సీటు, అత్యధిక మెజార్టీ వచ్చే సీటు హుజూర్‌నగరేనని వాదిస్తున్నారు.