నల్గొండ

గంగమ్మ ఒడికి గణపయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: భక్తుల నవరాత్రుల పూజలందుకున్న వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని జిల్లా ప్రజలు, భక్తులు శనివారం కోలాహలంగా భారీ ఊరేగింపులతో సాగిన శోభాయాత్రల మధ్య ఘనంగా నిర్వహించారు. పార్వతీ ముద్దుల తనయ గణపయ్య నిమజ్జన శోభాయాత్రలు ఉదయం నుండి మొదలై అర్ధరాత్రి వరకు కూడా కొనసాగగా గంగమ్మ ఒడి చేరిన గణపయ్యలతో నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. గణేష్ శోభాయాత్రలు నృత్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండుమేళాలు, బాణసంఛా పేలుళ్లల మధ్య, విచిత్ర, పౌరాణిక వేషధారణల మధ్య పిల్లా పెద్ద, మహిళా బేధం లేకుండా అంతా ఆటపాటలతో, భజనలతో గణపతి బొప్పా మోరియా అంటు శోభాయాత్రలతో గణేషుడి నిమజ్జనోత్సవాలను సంబరంగా నిర్వహించారు. రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలను నవరాత్రులు పూజించిన భక్తులు, ఉత్సవ నిర్వాహకులు అందంగా అలంకరించిన వాహానాలపై కొలువుతీర్చి నిమజ్జనోత్సవానికి ఊరేగింపులతో తరలించారు. జిల్లా కేంద్రం నల్లగొండలో 1వ నెంబర్ వినాయకుడి వద్ధ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎ.వి.రంగనాథ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, బిజెపి నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పి.వి.శ్యాంసుందర్, నూకల వెంకటనారాయణరెడ్డి, గణేష్ ఉత్సవ సమితి నాయకులు అంజిరెడ్డి, మామిడి శ్రవణ్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో కంచర్ల అనుచరుడు పిల్లి రామరాజు 3లక్షల 71వేలకు దక్కించుకున్నారు. అనంతరం భారీ శోభాయాత్రలతో తరలివచ్చిన జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లోని భారీ గణేష్ విగ్రహాల ఊరేగింపు గడియారం సెంటర్‌కు చేరుకున్న సందర్భంగా ప్రజలు, జిల్లా పోలీస్ శాఖ, గణేష్ ఉత్సవ సమితి పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. పోలీస్ శాఖ భక్తులకు పులిహోరా, పెరుగన్నం ఉచితంగా అందించారు.కోలాహలంగా సాగిన శోభాయాత్రల మధ్య సాగిన వినాయక విగ్రహాలను నల్లగొండలో వల్లభ చెరువు ఘాట్, నాగార్జున సాగర్ 14వ మైలురాయి, సాగర్ ఎడమకాలువ, సాగర్ డ్యాం, శ్రీశైలంతో పాటు వివిధ ప్రాంతాల్లో, స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. శోభాయాత్ర ఆధ్యంతం కూడా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. సిసి కెమెరాలతో పాటు వీడియోలు, నిఘా బృందాల పర్యవేక్షణ కొనసాగింది. నిమజ్జనోత్సవ ఘాట్‌ల వద్ధ బారికేడ్లు, క్రేన్లు, నాటుపడవలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. చెరువులు, ఘాట్‌ల వద్ధ రాత్రుల్లో నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నల్లగొండతో పాటు వివిధ మండలాలకు సంబందించి 5వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు.

అభివృద్ధి పనులే గెలిపిస్తాయ: బూర
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 22: కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మరోసారి ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలో జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావుపల్లి, గౌసుకొండ, రామలింగంపల్లి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, రేవణ్‌పల్లి తదితర గ్రామాల్లో సీసీరోడ్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్ది పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పైళ్ల శేఖర్‌రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల ఓట్లతో టీఆర్‌ఎస్ గెలుపు తధ్యమన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు.