నల్గొండ

కాంగ్రెస్‌లో డబుల్ సీట్ల పేచీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా తమతో పాటు తమ కుటుంబీకులకు పార్టీ టికెట్లు కోరుతుండటం పార్టీ అధిష్టానానికి సమస్యాగా మారుతుంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రతికూలంగా ఉన్నప్పటికి అధికార సాధనకు మేజిక్ ఫిగర్ సీట్లను సాధించేందుకు టికెట్ల కేటాయింపు చేయాల్సిందేనంటు ఆశావహులు కోరుతున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం తాజామాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఈ దఫా తనతో పాటు తన రాజకీయ వారసుడిగా కుమారుడు రఘువీరారెడ్డిని ఎన్నికల్లో పోటీకి చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కేటాయింపును కోరుతున్నారు. తాను మిర్యాలగూడ నుండి పోటీకి దిగి తన కుమారుడు రఘువీరారెడ్డిని సాగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దించాలని జానారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల పిదప కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే సీఎం పదవికి ప్రయత్నించడం, కుదరకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుండి పోటీ చేయాలన్న వ్యూహాంతో జానారెడ్డి ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నుండి మరోసారి పోటీ చేయనుండగా కోదాడ నుండి ఆయన సతీమణి పద్మావతి ఉత్తమ్ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే పొత్తుల్లో భాగంగా మహాకూటమి భాగస్వామ్య పార్టీ టీడీపీ ఈ సీటు కోరిన పక్షంలో ఉత్తమ్ కోదాడ సీటును వదిలేయవచ్చని తెలుస్తుంది. ఇక నల్లగొండ స్థానంలో మరోసారి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనుండగా, ఆయన తమ్ముడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అనుఛరులతో సమావేశాలు సైతం నిర్వహించారు. అంతకు ముందునుండే మునుగోడు కాంగ్రెస్ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతి ఇక్కడి నుండి పోటీకి సన్నద్ధమయ్యారు. రాజగోపాల్‌రెడ్డి, స్రవంతిల మధ్య టికెట్ల పంచాయతీ కొనసాగుతుండగానే ఇదే మునుగోడు స్థానాన్ని మహాకూటమి భాగస్వామ్య పార్టీ సీపీఐ సైతం కోరుతుండటం మరో సమస్యగా తయారైంది. అటు నకిరేకల్(ఎస్సీ) సీటును తమ అనుఛరుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కోరుతున్నారు. కాంగ్రెస్ మరో సీనీయర్ నేత మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి సూర్యాపేట టికెట్ కోరుతుండగా ఇదే టికెట్‌ను రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన పటేల్ రమేష్‌రెడ్డి ఆశిస్తున్నారు. అయితే దామోదర్‌రెడ్డి కుమారుడు ఏఐసీసీ సభ్యుడైన నరోత్తంరెడ్డి భువనగిరి, నల్లగొండ ఎంపీ స్థానాల టికెట్‌పై కనే్నయగా తండ్రికొడుకులిద్ధరికి ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఇవ్వడం సందేహాంగా ఉంది. ఇదే రీతిలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సైతం ఒకే కుటుంబం నుండి ఇద్దరు టికెట్లు ఆశిస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వానికి టికెట్ల కేటాయింపు, సీట్ల సర్ధుబాట్ల వ్యవహారం మరింత మరింత జఠిలంగా తయారైంది.

కాంగ్రెస్ గెలుపుకోసంకృషిచేయాలి
* మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషిచేయాలని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌస్‌లో మాజీ ఎంపీపీ వీరన్న ఆధ్వర్యంలో చివ్వెంల మండలం బండమీది చందుపట్ల, రోళ్లబండ తండ, మొగ్గయ్యగూడెం గ్రామాల నుంచి టీడీపీ, ఓపీడీఆర్‌లకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారికి ఆయన పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సోనియాగాంధీ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పి తానే సీఎం అయ్యాడని విమర్శించారు. నిజం చెప్పేది ఎవరంటే సత్యహరిశ్చంద్రుడని, అబద్ధం చెప్పేది ఎవరయ్యా అంటే కేసీఆర్ అని ఎద్దేవచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆరు సిలిండర్‌లు, రుణాలు, ఇంట్లో ఉన్న అర్హులైన వారందరికీ పింఛన్, అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, సుధీర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, కొండల్, శేఖర్‌రెడ్డి, రమేష్‌రావు, చెంచల శ్రీనివాస్, స్వామినాయుడు, జహీర్, కమ్రుద్దీన్, హరికృష్ణ, వెంకన్న, హముడా, శ్రీనివాస్, లాల్ అహమ్మద్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.