నల్గొండ

ప్రభుత్వ సహకారంతో మత్స్యకార్మికులు ఎదుగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 24: ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహకారంతో మత్స్యకార్మికులు అభివృద్ధి వైపు పయనించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. రాష్ట్ర మత్స్యసహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు టీవీఎస్ ద్విచక్ర వాహానాలు, ఆటోలను సోమవారం ఎన్‌జి కళాశాల మైదానంలో భారీగా నిర్వహించిన సభలో ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాకు 51కోట్లు నిధులు కేటాయించగా చేప పిల్లల పంపిణీతో పాటు ఉపకరణాల పంపిణీ చేపట్టామన్నారు. దళారి వ్యవస్థతో నష్టపోకుండా మత్స్యకారులు సంఘటితంగా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చేపల ఉత్పత్తి పెంచాలన్నారు. ఈ సందర్భంగా 220మత్స్య సహకార సంఘాలకు 220టీవీఎస్ మోపెడ్‌లతో పాటు145 లగేజ్ ఆటోలు, 10మొబైల్ ఆటోలు, ఇతర వాహనాలు, పరికరాలు అందచేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత మాట్లాడుతు జిల్లాకు 14కోట్లు మంజూరుకాగా మొదటి విడతగా 7కోట్లతో వాహనాలు సమకూర్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రంగనాథ్, జెసి సి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రణయ్ విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలి

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 24: మిర్యాలగూడ హత్యకు గురైన దళిత యువకుడు పి.ప్రణయ్‌కుమార్ విగ్రహాన్ని నడిరోడ్డుపై ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ స్థానిక న్యాయ అధికార సేవాసంస్థలో ప్రీ లిటిగేషన్ కేసును ముగ్గురు న్యాయవాదులు సోమవారం నాడు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు దాఖలు సంస్థ చైర్మన్, అదనపు జిల్లా జడ్జి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్‌పి, మునిసిపల్ కమీషనర్, ఆర్ అండ్ డిఈఈలను ప్రతివాదులుగా చేస్తు ముగ్గురు న్యాయవాదులు చిలుకూరి శ్యాం, పూసపాటి పరమేష్, డి.రాజశేఖర్‌నాయక్‌లు పిటిషన్ వేయడం జరిగింది. రెండు కుటుంబాల సమస్యలో హత్యకు గురైన ప్రణయ్ హత్య అని వారికి జరిగిన అన్యాయంలో విగ్రహాలను పెట్టుకోవాలన్న తపన కుటుంబసభ్యులకు ఉండటం కాదనడం లేదన్నారు. వారు తమస్థలాల్లో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. కుల, మత విద్వేషాలు ప్రజల మధ్య పెరిగే అవకాశాలుంటాయన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు విగ్రహాల విషయంలో ఇచ్చిన తీర్పును ఈ విషయంలో పరిగణించాలని కోరారు. సమాజ శ్రేయస్సు దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట న్యాయవాదులు కర్నం లింగయ్య, ఇబ్రాహిం, డి.మట్టయ్య, కె.వెంకట్‌రెడ్డి, కె.శ్రీను, కల్యాణ్, ఎల్లయ్యలున్నారు.
ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి వద్దంటు ఎస్పీకి వినతి
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 24: మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతినివ్వరాదంటు తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నల్లగొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌కు వినతి పత్రం అందించారు. ర్యాలీలో మారుతిరావుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు భూపతిరాజుతో పాటు నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య నాయకులు పలువురు పాల్గొన్నారు.