నల్గొండ

ఈవీఎంలను పరీక్షించిన ఇంజినీర్ల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 25: ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు చేరుకున్న ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను మంగళవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలో మొదటి విడత తనిఖీని చేపట్టారు. బెంగళూరు నుంచి వచ్చిన బీహెచ్‌ఈఎల్ ఇంజినీర్ యోగేశ్‌కుమార్ నేతృత్వంలోని 10 మంది ఇంజినీర్ల బృందం మొదటిరోజున 140 ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వీటిలో రెండు ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి స్థానంలో మరోయంత్రాలను వినియోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్ల తనిఖీలను జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, జేసీ డీ.సంజీవరెడ్డిల సమక్షంలో పర్యవేక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను పకడ్బందీగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజున రాజకీయపార్టీల గుర్తులు, ఓటింగ్ విధానంపై తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల అనంతరం సక్రమంగా పనిచేసిన వాటిని, సాంకేతిక లోపాలు ఉన్నవాటిని గుర్తించి వేరుచేసినట్లు పేర్కొన్నారు. ఇంజినీర్ల బృందం సాంకేతిక లోపాలు గుర్తించి వాటి పనితీరు మెరుగుపడని పక్షంలో అట్టి యంత్రాలను తిరిగి పంపి వాటి స్థానంలో కొత్తవాటిని తెప్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం బాబూరావు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రామ్‌పతి, ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్, ఎన్నికల సూపరింటెండెంట్ యాదగిరి తదితరులు ఉన్నారు.