నల్గొండ

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 25: అపరిచిత వ్యక్తులపట్ల వసతి గృహాల వార్డెన్‌లు, మ్యాట్రిన్లు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎస్పీ రంగనాథ్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొని మాట్లాడారు. హాస్టల్స్‌లో రాత్రి వేళలలో ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించి క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు సైతం జాగ్రత్త తీసుకోవాలని 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్‌కు బంధుత్వాల పేరు వచ్చే యువకులపై తల్లిదండ్రులతో చర్చించి క్రమశిక్షణా వాతావరణం ఏర్పాటు చేయలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, గురుకుల పాఠశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ హాస్టల్స్ మాదిరిగా ప్రభుత్వ హాస్టల్‌లలో తల్లిదండ్రులు, బంధువులు కలుసుకునే విధంగా సమయపాలన పెట్టాలన్నారు. నేరాల నియంత్రణకు 9963396970 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. సమావేశంలో షీటీం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఏఎస్‌ఐ సోమిరెడ్డి, విజయ, రమేష్, రేవతి, నరసింహా పాల్గొన్నారు.