నల్గొండ

కాంగ్రెస్ గూటికి బాలునాయక్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 25: నల్లగొండ జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ తిరిగి సొంతగూటికి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. బాలునాయక్ తన అనుఛర వర్గంతో కలిసి ఈనెల 27న గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దేవరకొండ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్‌ఎస్ టికెట్ ఆశీంచిన బాలునాయక్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొండి చేయి చూపారు. తన కంటే వెనుక సీపీఐ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌కే తిరిగి కేసీఆర్ దేవరకొండ టికెట్ ఇవ్వడంతో బాలునాయక్ తీవ్ర నిరాశ చెందారు. దీంతో తనను మొదటి నుండి రాజకీయంగా ప్రొత్సహించి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా చేసిన కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లేందుకు బాలునాయక్ నిర్ణయించుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్ నేత కై.జానారెడ్డికి అనుచరుడిగా కొనసాగిన బాలునాయక్ కాంగ్రెస్‌లో ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మార్కెట్ చైర్మన్‌గా పనిచేసి, 2009 ఎన్నికల్లో దేవరకొండ నుండి తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు నేపధ్యంలో అప్పట్లో తన సిట్టింగ్ స్థానాన్ని సీపీఐకి వదిలారు. ప్రత్యామ్నాయంగా బాలునాయక్‌ను నల్లగొండ జడ్పీ చైర్మన్‌గా ఎన్నిక చేసేందుకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ చందంపేట జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన వెంటనే జడ్పీ చైర్మన్‌గా ఎన్నిక చేసింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ప్రభుత్వం నుండి నిధుల సాధన నేపధ్యంలో బాలునాయక్ జడ్పీటీసీల ఒత్తిడి మేరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే బాలునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరిన కొన్నాళ్లకే నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు కాంగ్రెస్, సీపీఐలకు గుడ్‌బై కొట్టి మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. గుత్తా, రవీంద్రకుమార్‌లు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుండి బాలునాయక్‌కు టీఆర్‌ఎస్‌లో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ బాలునాయక్, రవీంద్రకుమార్ వర్గాలుగా విడిపోగా రెండు వర్గాలు తరుచు తగాదాలతో రచ్చ కెక్కాయి. అయనప్పటికి బాలునాయక్ టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో ఓపిక వహించి ఉమ్మడి నల్లగొండ జిల్లా నూతన జడ్పీ కార్యాలయం భవనం నిర్మింపచేసి అసంపూర్తి భవనానే్న ప్రారంభించారు. ఈ భవనం పూర్తికి అడిగిన నిధులను సైతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం బాలునాయక్‌కు ఇబ్బందికరంగా తయారైంది. చివరకు ముందస్తు ఎన్నికల్లో తాను దేవరకొండ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ కోసం తిరిగి కాంగ్రెస్ గూటికే చేరేందుకు బాలునాయక్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌లో చేరుతున్న బాలునాయక్ దేవరకొండ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన నల్లగొండ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జగనలాల్‌లు దేవరకొండ నుండి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం బాలునాయక్, బిల్యానాయక్, జగన్‌లాల్‌నాయక్‌లలో ఎవరికి టికెట్ ఇస్తుందో.. లేక మహాకూటమి ఏర్పాటులో సీపీఐకి సీటు వదిలేస్తారా? అన్న ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

ఘనంగా నిత్యారాధనలు

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి ఆరతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభించి ప్రతిష్ఠామూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. దర్శన మూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి అర్చించారు. స్వామి, అమ్మవార్లను అత్యంత సుందరంగా అలంకరించారు. విశ్వక్సేనారధన, శ్రీ సుదర్శన నారసింహహోమం, పుణ్యాహావఛనం, గజవాహన సేవలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. బాల ఆలయంలో అష్టోత్తర, సహస్ర నామార్చనల్లో రోజంతా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండిజోడి సేవ నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి మంగళవారం పురస్కరించుకుని పంచామృతాభికం చేసి చందనలేపం అద్ది పుష్పమాలలతో అలంకరించి తమలపాకులతో సహస్రనామార్చన ఆకుపూజోత్సవం నిర్వహించారు. అనంతరం మంత్ర పుష్పం, నిరాజన కార్యక్రమాలు నిర్వహించి ఆరతి నివేదన చేశారు. ఆయ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు
* మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక

సూర్యాపేట, సెప్టెంబర్ 25: మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాల్టీకి ప్రకటించిన రూ.75 కోట్ల నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో రూ.3లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ఏడాది జిల్లా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాము కోరిన వెంటనే మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.75 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకచారని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేశారన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదించిన పనులకు ఆమోదం తెలుపుతూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నిధులతో జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించడంతోపాటు అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతామని, అదేవిధంగా నాలా నిర్మాణ పనులను పూర్తిచేస్తామని తెలిపారు. మంజూరైన అన్ని అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుంభం రజిత, తండ శ్రీను, నాయకులు వెంపటి గురూజీ, చక్రహరి నాగరాజు, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మద్దతుధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
* జేసీ డి.సంజీవరెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 25: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా తగు ఏర్పాట్లుచేయాలని జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో వ్యవసాయ, డీఆర్డీఏ, పౌర సరఫరాల, సహకారశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 13 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 11 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 70,900 హెక్టార్లలో రైతులు వరిని సాగుచేశారని, 3.97లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతుధర గ్రేడ్ ఏ రకానికి రూ.1770, సాధారణ రకానికి క్వింటాకు రూ.1750 ప్రకటించిందన్నారు. మద్దతు ధర గతంలో కంటే పెరిగినందున రైతులు అధికంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకవచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సరిపడా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను, టార్పాలిన్లను తగిన విధంగా ఏర్పాటుచేసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సుందర్ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉషారాణి, జిల్లా పౌర సరఫరాల సంస్థ రామ్‌పతినాయక్, జిల్లా సహకార అధికారి ప్రసాద్, మార్కెటింగ్ ఏడీ నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.