నల్గొండ

దిగ్విజయ్ వ్యాఖ్యలు అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 19: దేశంలో బిజెపి సంఘపరివార్ మత విద్వేష కార్యక్రమాలకు ఆజ్యం పోస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అనడం అర్థరహితమని, అది ఆయన అవివేకానికి నిదర్శనమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి అన్నారు. గురువారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసుదన్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ దేశంలో కులమత విద్వేశాలకు, ఉగ్రవాదులను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. పంజాబ్‌లో సిక్ ఉగ్రవాదాన్ని అస్సాంలో వేర్పాటు వాదం, ముంబాయిలో బాంబు పేలుల్లు, కాశ్మీర్ నుండి రాబడిన తుపాకీ సంస్కృతి కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాల కారణంగానే హైద్రాబాద్ బాంబు విస్పోటనాలు, మత కలహాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెష్ నేతలు జాతికి నీతిని నేర్పుతున్నారని ముందు వారు పాటించాల్సిన అవసరముందని సూచించారు. 80వేల మంది పౌరులు, భ్రధ్రతా సిబ్బంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే భలి అయ్యారి గుర్తు చేశారు. అస్థిత్వాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాలేని పరిస్థితిలో నిరాశా నిస్పృహలకు లోనై బిజెపి సంఘ పరివార్‌లపై విమర్శలు చేయడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేని కాంగ్రెస్ ఇలాంటి ఉద్రిక్త వాతావరణాలను పెంచుతూ దేశ సమైఖ్యతను దెబ్బతీయడం సరికాదన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైందని, గవర్నర్ దగ్గర 26ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేస్తామన్నారని ఒక్కటి కూడా పూర్తి చేయలేక పోయారరాన్నరు. కాంగ్రెస్ కాల్వల పేరున కమీషన్లు కొట్టి వేసిందని, ప్రజాస్వామ్యంలో కెసిఆర్ అవినీతి కాల్వలను పారిస్తున్నారని దుయ్యబట్టారు. పెండింగ్ ప్రాజెక్టులను విస్మరిస్తూ ప్రాజెక్టు డిజైన్లను మార్చి స్వలాభ పేక్షతో తతంగాలు చేస్తూ తాత్సారం చేస్తున్నారన్నారు. 2014వరకు కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉందని, బాబ్లి ప్రాజెక్టుపై ఎత్తుపెంచిన కట్టడాలు జరిగినప్పుడు మాట్లాడ కుండ ఇప్పడు అక్రమ ప్రాజెక్టులపై పోరాటాలు చేస్తామనడం వారికే చెల్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు వేసిన పునాది రాళ్లు అభివృద్ధి పనులకు నోచుకోకుండా ప్రస్తుతం సమాధుల్లా దర్శనమిస్తున్నాయని గమనించాలన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షభంలో కూరుకుపోయిందని లోయర్ మానేరు, నిజాంసాగర్‌లలో చుక్క నీరైనా లేకుండా దర్శనమిస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో నిలబెడతామని, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈనెల 30న చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి సమావేశాన్ని పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహిస్తామని, కేంద్రంలో మోదీ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్త్తయిన సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి చేర్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రానున్నట్లు పేర్కొన్నారు.