నల్గొండ

యాదగిరీశుడికి ఘనంగా నిత్యారాధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, నవంబర్ 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రక్తంగా సాగాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కోలిపి హారతి నివేధన చేశారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోఛ్చరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం పాంఛరాత్రాగమ శాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో, కార్తీక మాసం సత్యనారాయణ వ్రతాలు, దీపారాధనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామిఅమ్మవార్లకు వెండి జోడి సేవోత్సవం నిర్వహించారు.
బాలల దినోత్సవం సందర్భంగా దీక్షకు అవార్డు
కోదాడ, నవంబర్ 14: నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా కోదాడ రిషి డ్యాన్స్ అకాడమి విద్యార్థిని ఆరె దీక్షకు అవార్డును ప్రథానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రిషి డ్యాన్స్ అకాడమి మాస్టర్ నాగేశ్వరరావు, తల్లిదండ్రులు నవీన్, మాధవిలు దీక్షను అభినందించారు.
ప్రారంభమైన పాదయాత్ర
హుజూర్‌నగర్, నవంబర్ 14 : ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోదాడ నుండి మట్టపల్లి శ్రీలక్ష్మినృసింహాస్వామి క్షేత్రానికి వెళ్లుతున్న శ్రీస్వాతి నక్షత్ర మహాయజ్ఞ ట్రస్టు సభ్యులు, మరియు మట్టపల్లి స్వామి మాలాధరణ స్వాములు పాదయాత్ర బుధవారం ఉదయం హుజూర్‌నగర్ పట్టణానికి చేరుకున్నది. స్వాములు దీక్షత్‌నగర్, మల్లన్ననగర్‌ల మధ్యన ఉన్న శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ఊరేగింపులతో, నృసింహాస్వామి వారి విగ్రహాలను తరలిస్తు మట్టపల్లి క్షేత్రానికి బయలుదేరారు. పాదయాత్రలో ట్రస్టు చైర్మన్ శ్రీనివాసన్, రమేష్, కె శ్రీనివాసన్, సృజన్, విద్యాసాగర్, కాంతయ్య, ఆండాళ్లు పాల్గొన్నారు.