నల్గొండ

అభివృద్ధి చూసి గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 16: నల్లగొండ నియోజకవర్గానికి ఇంతకాలం తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించి రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేసే అవకాశమివ్వాలని పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో-చైర్మన్, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి నల్లగొండ మున్సిపాల్టీ శివారులోని పానగల్‌తో పాటు చందనపల్లిలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్‌ను తాను ఎంతో అభివృద్ధి చేశానని, రైల్వే ఫ్లై వోవర్ వంతెన, దేవాలయాల అభివృద్ధి, సీసీ రోడ్లు నిర్మింపచేశానన్నారు. మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించానని, ఉదయ సముద్రం రిజర్వాయర్‌ను అభివృద్ధి జరిపించి పట్టణానికి తాగునీటి కొరత లేకుండా చూశానన్నారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని సబ్‌స్టేషన్లు నిర్మింపచేశానన్నారు. నల్లగొండ ప్రజల సర్వతోముఖాభివృద్ధి నిధుల సాధనలో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రైతురుణాలమాఫీ, మహిళా సంఘాలకు భారీగా రుణాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రెండువేల పింఛన్, పంటలకు మద్దతు ధర, పేదలందికి ఐదులక్షలతో ఇళ్లు మంజూరు చేయబోతున్నామన్నారు. ఈసందర్భంగా భవానీ యూత్ సభ్యులు, చందనపల్లిలోని పలువురు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, గుమ్మల మోహన్‌రెడ్డి, జిల్లెపల్లి పరమేశ్, రూపాలి నర్సింహ, లింగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.