నల్గొండ

అభివృద్ధిని చూసి ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 16; గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడంతో పాటు హామీలివ్వకుండానే అనేక కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధిని చూసి మరింత అభివృద్ధి కోసం మరోమారు టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో మార్కెట్ హమాలీలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌తో పాటు కార్మికుల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. సూర్యాపేటలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి అధికంగా జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు మూసీ మురికి నీటి నుండి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడ ఇచ్చామన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా మోడల్ మార్కెట్ నిర్మించడం జరుగుతుందని, అదేవిధంగా మినీట్యాంకు బండ్ జిల్లా కేంద్రానికి తలమానికంగా మారిందన్నారు. స్థానికులు ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయించినట్లు చెప్పారు. సూర్యాపేటలో ఎలాంటి ఆరాచకాలకు తావులేకుండా అన్నివర్గాలు శాంతియుతంగా జీవించేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పించినట్లు చెప్పారు. కార్మికులందరికీ ప్రభుత్వ పరంగా జీవిత బీమాను కల్పిస్తామన్నారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటమి భయంతో ఓ అభ్యర్థి ఓటర్లకు భారీగా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి, శాంతి, సుస్థిర పాలన కోసం తనను మరోమారు గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు వెంపటి గురూజీ, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, బాణాల విజయ్‌కుమార్, నూకల మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.