నల్గొండ

తెలంగాణ సంస్కృతిని పరిరక్షించిన జాగృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 17: సమైక్య పాలకుల కుట్రలతో కనుమరుగవుతున్న దశలో ఉన్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్‌హాల్లో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని ఉపేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సంస్థ ఉమ్మడి జిల్లా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైఖ్య పాలకులు తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, నీళ్లు దోచుకోవడంతోపాటు చివరికి సంస్కృతి, సంప్రదాయాలను కూడా దెబ్బతీసేందుకు యత్నించారన్నారు. ఈ దశలో మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆవిర్భవించిన జాగృతి సంస్థ ఆ దిశగా పనిచేసి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మన సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ, బోనాల పండుగలను భారీగా నిర్వహించి తెలంగాన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీ ఆర్ ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాన జాగృతి ఇదే పంథాను కొనసాగిస్తూ తెలంగాణ సంస్కృతిని కాపాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి కార్యకర్తలు తెలంగాణ పోరాటం చేసిన టీ ఆర్ ఎస్‌ను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాగృతి కళా బృందం కో ఆర్డినేటర్ కోదారి శ్రీను జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడ రాజీవ్‌సాగర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, నాయకులు లీల, ఉమామహేశ్వరి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.