నల్గొండ

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 17: హుజూర్‌నగర్ తాజా మాజీ ఎంయల్‌ఏ టిపిసిసి అధ్యక్షుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం స్థానిక తహశీలుదారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో రెండు సెట్లు నామినేషన్‌లు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన హైద్రాబాద్ నుండి నేరుగా పట్టణ శివారులోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వేలాది మంది కాంగ్రెసు కార్యకర్తలు, మిత్రపక్షమైన టిడిపి, సిపిఐ, టిజెయస్ కార్యకర్తల భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 7 మండలాల నుండి భారీ ఎత్తున కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హుజూర్‌నగర్ చేరుకోవటంతో పట్టణంలో ఎక్కడి కక్కడ ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఆయన వెంట సతీమణి కోదాడ తాజా మాజీ ఎంయల్‌ఏ యన్ పద్మావతీరెడ్డి, సీనియర్ నాయకులు వంగాల స్వామిగౌడ్, ఎరగాని నాగన్న, అరుణ్‌కుమార్, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి తదితరులు ఉన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం మధ్యనే: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోట్లాది మంది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అణచివేతకు గురి చేసిన కెసిఆర్ కుటుంబాన్ని ఈఎన్నికలలో కెసిఆర్ కుటంబాన్ని తరిమి కొట్టాలని టిపిసిసి అధ్యక్షుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపి, సిపిఐ, టిజెయస్ కలిసి పీపుల్స్ ప్రంటుగా పోటీ చేస్తున్నాయని ఎన్నికల అనంతరం కూడా కామన్ మినిమం కార్యక్రమం
అమలు చేస్తాయని అన్నారు. గత 10 సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ది చేశానని రానున్న ఎన్నికలో 70, 80 వేల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చటానికి పీపుల్స్ ప్రంటు కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించిందని ఆచార్య కోదండరామ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని అన్నారు. కెసిఆర్ చేసిన వాగ్దానాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్‌లు, ఇంటికో ఉద్యోగం ఏవీ అమలు చేయదని రైతుల చేతులకు కాళ్లకు బేడీలు వేయించి తిప్పారని ఉత్తమ్ విమర్శించారు. టిఆర్‌యస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని , పాతర వేయాలని యస్‌సి, యస్‌టి, బిసి, ముస్లీం వర్గాలను అణచివేతకు గురి చేశారని మంద కృష్ణను రెండు సార్లు, కోదండరామ్‌ను రెండు సార్లు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. పీపుల్స్ ప్రంటు అధికారంలోకి రాగానే రైతుల 2లక్షల రుణాలు మాజీ చేస్తామని, 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామని, మహిళా సంఘాల భవనాలకు 10లక్షలు, సంఘాలకు 5 లక్షలు, పేదలకు సన్న బియ్యంతో పాటు, రేషన్ కార్డుపై అన్ని వస్తువులు, యస్‌సి,యస్‌టిలకు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా అందిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం బందిపోటు దొంగల్లా దోచుకున్నారని, మిషన్ భగీరధ క్రింద ఒక్క ఇంటికి నల్లా ఇవ్వలేదని, ఒక్క ఎకరానికి అదనంగా నీరు అందించలేదని అసలు సియం సచివాలాయానికే రాలేదని, అత్యంత విలాసవంతమైన కార్లలో, విమానాలలో, భవనాలలో నివాసం చేస్తున్నాడని ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి కోదాడ తాజా మాజీ ఎంయల్‌ఏ యన్ పద్మావతీరెడ్డి, కాంగ్రెసు, టిడిపి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.