నల్గొండ

కూటమి గెలవకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటాం: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 18: ప్రజాకూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా తన పదవికి రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే మంత్రి కేటీఆర్ ఆయన చేసిన సవాల్‌కు కట్టుబడి రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోకన్వీర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతిసవాల్ చేశా రు. ఆదివారం నల్లగొండ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిదప టీడీపీ జిల్లా కార్యాయానికి చేరుకుని మహాకూటమి నాయకులతో కలిసివిలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కోటి ఆశలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబంలోని నలుగురి చేతిలో బందీయైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల్లో వేలకోట్ల కమిషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం ఎన్నికల్లో ధనబలంతో గెలిచేందుకు యత్నిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, కార్మికులు, రైతులు, మహిళలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం చేసింది చెప్పుకోకుండా ఏపీ సీఎం చంద్రబాబును, ప్రజాకూటమిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న తీరును గమనించినట్లయితే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందన్న భయం కేసీఆర్‌లో ఉందని తేలుతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో 24గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ సఛివాలయానికి రాకుండా ప్రగతిభవన్ కేంద్రంగా పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగాన్ని ఆపహాస్యం చేశాడన్నారు. మహిళలకు మంత్రి మండలిలో స్థానం కల్పించకుండా అవమానించారని, లక్ష ఉద్యోగాలని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను, రిజర్వేషన్లు, భూపంపిణీ పేరుతో దళిత, గిరిజన, మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. మిగులు బడ్జెట్ తెలంగాణను రెండులక్షల కోట్ల అప్పుల పాలు చేసిన అసమర్ధ పాలన కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ వచ్చినా పేదోడికి ఇళ్లు దక్కలేదని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు రాలేదన్నారు. నాలుగున్నర ఏళ్లలో కేసీఆర్ సీఎంగా నల్లగొండలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాలేదని, దివంగత కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ 22పర్యాయాలు జిల్లా పర్యటనలకు వచ్చారన్నారు. కేసీఆర్ పరిపాలన వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీస్తామన్న భయంతో ప్రతిపక్షాలను గెంటేసి తమశాసన సభ్యత్వాలను రద్ధు చేయించారన్నారు. తనను నల్లగొండలో ఓడించేందుకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవిందర్‌రావును పెట్టి కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసిన నల్లగొండ ప్రజలు చైతన్యంతో వ్యవహారించి తనను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాకూటమి పార్టీలు ఎన్నికల్లో కేసీఆర్ నియంత పాలన అంతమొందించే లక్ష్యంతో ఐక్యంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ పథకంపై చేస్తుందన్నారు. రెండువేల పెన్షన్స్, పేదలందరికి ఐదులక్షల ఇండ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు రీయాజ్ అలీ, ఎల్.వి.యాదవ్, తుమ్మల మధసూధన్‌రెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, అకునూరి సత్యనారాయణ, ఇంతియాజ్ అలీ, మిర్యాలయాదగిరి, ప్రసన్న, కాంగ్రెస్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అల్లి సుభాష్, టీజేఎస్ నాయకులు పన్నాల గోపాల్‌రెడ్డి, వీరానాయక్‌లు తదితరులు ఉన్నారు.