నల్గొండ

నాడు మాటల గారడీ.. నేడు మూటల గారడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, నవంబర్ 19: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మాటల గారడీ కాలయాపన చేసి నేడు ధనం మూటలతో ఎన్నికల్లో గారడీ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చేస్తున్నారని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక ఎస్‌పి ఫంక్షన్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం దారుణమన్నారు. నాలుగున్నరేళ్లు మాటలతో కాలం గడిపారని, తిరిగి గెలిపిస్తే అంతే ఉంటుందన్నారు. నాలుగున్నరేళ్లలో సంపాదించిన మూటలను నేడు విప్పి ఎన్నికల్లో ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ 26 మంది బిసిలకు అభ్యర్ధిత్వం ఇవ్వగా తాము 27 మందికి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టిలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం అభ్యర్ధిత్వం విషయంలో అధిష్టానందే నిర్ణయమన్నారు. అభ్యర్ధిత్వం కోసం పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ వారు సీనియర్లున్నారని వారు కూడ టికెట్ ఆశించారని, తాను కూడ తన కుమారుడి కోసం ఆశించానని దక్కలేదన్న బాధ అందరికున్నట్టు తనకున్నదన్నారు. కూటమిలోని భాగస్వామి పార్టీ అయిన తెలంగాణా జనసమితి స్నేహపూర్వక పోటీలో ఉంటుందన్నారు. కృష్ణయ్య స్థానికుడు కాదని కొందరంటున్నారని, ఆయన దేశంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని ఉద్యమకారుడన్నారు. ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో అభ్యర్ధి ఆర్.కృష్ణయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎండి.యూసుఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, బాబురావునాయక్, కాంగ్రేస్ నాయకులు పి.రాంలింగయ్య, చిరుమరి కృష్ణయ్య, దైదా సంజీవరెడ్డి, కందిమళ్ల లక్ష్మారెడ్డి, ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కోటిరెడ్డి, పొదిల శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.