నల్గొండ

మహాకూటమిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 19: ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మహాకూటమి అభ్యర్ధిగా సోమవారం జిల్లాకేంద్రంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలతో కలిసి ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఆర్ నివాసం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహించిన ఈర్యాలీలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారన్నారు. కేసీఆర్ మాయమాటాలతో ప్రజలను వచించి అధికారం చేపట్టిన తర్వాత నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను హరించారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలను విస్మరించి రైతులు, పేదల సంక్షేమాన్ని మరచిన టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి కేసీఆర్ 9నెలలకు ముందే శాసనసభను రద్దు చేసి మరోమారు ప్రజలను మోసగించేందుకు యత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మ్యానిఫేస్టొ అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని, 2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్‌ల పెంపు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు తదితర పథకాలు ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. సూర్యాపేటలో గత కాంగ్రెస్ హాయంలో చేపట్టిన పనులనే తాముచేసినట్లుగా మంత్రి జగదీశ్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. పటేల్ రమేష్‌రెడ్డి తనతో కలిసి పనిచేస్తారని, పార్టీ అధిష్టానం చర్చించి సమన్వయ పరిచిందన్నారు. రమేష్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలకు తాను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో ఎఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా, టీజేఎస్ జిల్లా ఇంచార్జీ కుంట్ల ధర్మార్జున్, సీపీఐ జిల్లా నాయకులు దోరేపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, పోతు భాస్కర్, బైరు వెంకన్న, గోపగాని వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.