నల్గొండ

మహాకూటమి గెలుపు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, నవంబర్ 20: మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి గెలుపు తథ్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ. హనుమంతరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రిటైర్డు డీఈవో కుంభం శ్రీనివాస్‌రెడ్డి సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని కోల్పోడం బాధకరమన్నారు. సంతాప సభకు జనం పెద్దఎత్తున తరలిరావడం చూస్తే ఆయన ఎంతమందికి విద్యను అందించారో ఆయన మనస్సు ఎంత స్వచ్ఛమైనదో తెలుస్తుందన్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని డీసీసీ బూడిద భిక్షమయ్యగౌడ్ కోరారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన తండ్రిని కోల్పోడం బాధకరమని, భగవంతుడు ఆయనకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.
నాన్నను కోల్పోడం తీరని లోటు: కుంభం
నాన్నను కోల్పోడం తనకు తీరని లోటని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. కుంభం మాట్లాడుతూ మా నాన్న ఎంతో మంది విద్యావంతులను తయారు చేశారని, జిల్లాలోనే మంచి గణిత ఉపాధ్యాయుడిగా ఉండేవారన్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం సామాజిక సేవ చేసేందుకై సేవా సమితిని స్థాపించి ఎన్నో అభివృద్ది పనులను చేపట్టారన్నారు.
సంతాపకు సభకు హాజరైన ప్రముఖులు
మండల కేంద్రంలో నిర్వహించిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సంతాప సభకు అన్ని పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన వారిలో మాజీ ఎమ్మెల్యేలు గుర్రం యాదిగిరిరెడ్డి, కొమ్మిడి నర్సింహారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, తుమ్మల యుగంధర్‌రెడ్డి, పైళ్ల రాజవర్దన్‌రెడ్డి, వేముల అశోక్, గర్థాసు బాలయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహాంగీర్, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, ఏడమ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
సూర్యాపేట రూరల్, నవంబర్ 20: దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేసి చూపిన ఏకైక సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మండల పరిధిలోని బాలెంల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీపీ వట్టె జానయ్య ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని అభివృద్ధిని గ్రామాల్లో ప్రజలు చూస్తున్నారని మరల టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతించారు. పార్టీలో చేరిన వారు శివరాత్రి వెంకన్న, సుగుణమ్మ, వీరస్వామి, జానయ్య, యాదగిరి, నర్సింహులుతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో రామసాని శ్రీనివాస్‌నాయుడు, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, రూపాని శ్రీను, మామిడి తిరుమల్, మోతీలాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.