నల్గొండ

‘పేట’లో రెండోసారి జగదీశ్‌రెడ్డి గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 11: ఆసక్తికరంగా సాగిన శాసనసభ ఎన్నికల పోరులో జిల్లాకేంద్రమైన సూర్యాపేట స్థానంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండవసారి జయకేతనం ఏగురవేశారు. రాష్ట్రంలోనే త్రిముఖ పోటి నెలకొన్న ప్రధాన నియోజకవర్గంగా మారిన ఈస్ధానంలో రెండవసారి గులాబిజెండా ఎగురవేసి తన పట్టును నిలుపుకున్నారు. ఇక్కడ మహాకూటమి అభ్యర్ధిగా పోటిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రెండవస్థానంలో నిలవగా గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి రెండవస్ధానంలో నిలిచి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటిచేసిన సంకినేని వెంకటేశ్వరరావు మూడవస్థానానికి పరిమితమయ్యారు. త్రిముఖ పోటిలో విజయం సాధించేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారుగా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికి నియోజకవర్గ ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అనూహ్యంగా రెండవసారి గులాబీ జెండాకు జైకొట్టారు. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీఆర్‌ఎస్, మహాకూటమి మధ్య తీవ్రమైన పోటి జరిగినట్లు స్పష్టమైంది. హోరాహోరిగా జరిగిన ఎన్నికల పోరులో మొత్తం 1,81,598 ఓట్లు పాలవ్వగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 66,742 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్ధి, మహాకూటమి అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై 6,032ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి 60,801 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వరరావుకు 38,100ఓట్లతో మూడవ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత 2014 ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి మూడవ స్ధానంలో నిలవగా ఈ ఎన్నికల్లో ఆయన గట్టి పోటినిచ్చి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓటమిపాలు కాగా సంకినేని మూడవ స్ధానానికి దిగజారారు. గత ఎన్నికల్లో 2,219 ఓట్ల అధిక్యంతో గెలుపొందిన జగదీశ్‌రెడ్డికి ఈ సారి మరో నాలుగు వేలు అధికంగా ఓట్లు సాధించి 6,032ఓట్ల అధిక్యంతో 6,032 విజ్ఞలైన నియోజకవర్గ ఓటర్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆదరించి భవిష్యత్‌లో మరింత అభివృద్దిని కాంక్షిస్తూ జగదీశ్‌రెడ్డిని రెండవమారు గెలిపించారు. కాగా నియోజకవర్గంలోని రెండు పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలు మొరయించడంతో వాటిని లెక్కించాల్సి ఉన్న అందుకు అధికంగా మెజార్టీ సాధించడంతో జగదీశ్‌రెడ్డి గెలుపు ఖాయమైపోయింది. వాటి లెక్కింపు పూర్తయితే పూర్తి మెజార్టీ స్పష్టం కానుంది.