నల్గొండ

ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, జూన్ 17: పాలిటెక్నిక్‌లో ఫెయల్ అయినందుకు మనస్తాపానికి గురై విద్యార్ధిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని ఊకొండి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజూమున చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన పోగుల కృష్ణయ్య, యాదమ్మలకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు కలరు. రెండవ కుమార్తె పోగుల సోని (19) అనే విద్యార్ధిని నల్లగొండలోని ప్రభుత్వ కళాశాలలో పాల్‌టెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోని పాల్‌టెక్నిక్‌లో కొన్ని సబ్జెక్ట్‌లలో ఫెయల్ అయ్యిందని, ఫలితాలు వచ్చిన నాటినుండి బాధపడుతోందని తెలిపారు. . శుక్రవారం తెల్లవారుజామున తల్లియాదమ్మ, తమ్ముడు విశాల్ బయట నిద్రిస్తుండగా ఇంట్లోని ప్యాన్‌కు ఉరివేసుకుంది. తల్లి యాదమ్మ ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో కూతురు సోని ఉరివేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యుల సహకారంతో కిందకు దింపారు. అప్పటికే సోని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎఎస్సై వెంకటయ్య తెలిపారు.