నల్గొండ

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూన్ 17: నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో ఆర్టీఎ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో 1467పాఠశాల బస్సులుండగా ఇప్పటివరకు 1107బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ పొందాయి. మరో 360బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయి. జిల్లాలో 15సంవత్సరాలు దాటిన బస్సులు అధికంగా ఉన్నప్పటికి యాజమాన్యాలు యదావిధిగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా మే 15నుండి పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు పొందాల్సి ఉంటుంది. యాజమాన్యాలు ఆ దిశగా ప్రయత్నించక పోవడంతో అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థల ప్రారంభం రోజునే పర్మిట్, లైసన్స్ లేకుండా నడుస్తున్న రెండు బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా మరో రోజు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 150 ఆటోలను, మాక్సి క్యాబ్స్, తుఫాన్, టాటా ఎసి తదితర వాహనాలపై కేసులను నమోదు చేసినట్లు డిటిసి చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. జిల్లాలో 4,282ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 5.5లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో సుమారు 3.5లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి ఆటోలు, బస్సులలో పాఠశాలలోకి వెళ్తుంటారు. అయితే విద్యార్థులు ప్రయాణించే బస్సులకు ఫిట్‌నెస్ లేకపోతే ప్రమాదాలు తప్పవని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో ఆయాచోట్ల బస్సుల ఫిట్‌నెస్ కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అనుమతులు తీసుకున్నాయని, మిగతావాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలు ఈ విషయంలో ప్రభుత్వ నిబందనలు పాటించక పోవడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినపుడు చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు
పాఠశాల బస్సు బాడి పూర్తిగా సెమిసెలూన్ స్టీల్‌తో ఉండాలి, ప్రమాదానికి గురైన, నీళ్లలో పడినా వెంటనే ముప్పు జరగకుండా సెమీసెలూన్ స్టీల్ ఆపుతుంది. బస్సులో ప్రతి సీటు వద్ద కిటికీ ఉండి స్వచ్ఛమైన గాలి విద్యార్థులకు అందేలా చూడాలని కిటికీలకు ఊచల మధ్యదూరం 5సెంటీమీటర్లు ఉండాలని, విద్యార్థులు చేతులు, తల బయట పెట్టకుండా అడ్డుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులు 25కిలోమీటర్లు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా సీట్లు ఉండాలి బోల్టులు వదులుగా లేకుండా ఎప్పటికప్పుడు గట్టిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థి కూర్చునే సీటుకిందే బ్యాగులు దాచుకునేలా అల్మరాలను ఏర్పాటు చేయాలి. బస్సులో డ్రైవర్ క్యాబిన్ ప్రత్యేకంగా ఇనుముతో చేసి ఉండాలి. ఏ విద్యార్థి డ్రైవర్‌తో మాట్లాడకుండా, అతనికి తగలకుండా ప్రత్యేకంగా ఉండేలా చూడాలి. ప్రతి పాఠశాల బస్సుకు తప్పనిసరిగా వేగనియంత్రణ పరికరం అమర్చాలి. పట్టణాలలో గంటకు 40కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాలలో 50కిలోమీటర్లు మించకుండా చర్యలు తీసుకోవాలి. ప్రధమ చికిత్స ఏర్పాటుతోపాటు ప్రతి బస్సుకు ఒకే డోరు, రెండు అత్యవసర ద్వారాలు ఉండేలా చూడాలి. 1989వాహన చట్టం ప్రకారం ఫుల్‌బస్సు పసుపురంగుతో ఉండి ముందు భాగంపై స్కూల్ బస్సు అని రాసి, చిరునామా, కాంటాక్ట్ నంబర్లు ఎడమవైపు కనిపించేలా రాసి ఉండాలి. పాఠశాల బస్సు పరిధిలో ఉన్న రోడ్డు రవాణా, పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు రాయాలని నిపుణులు తెలుపుతున్నారు.