నల్గొండ

అప్పు తీర్చేందుకు దొంగతనాన్ని ఎంచుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జూన్ 17: మిత్రుడి వద్ద తీసుకున్న అప్పును తీర్చేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో ఇద్దరు మిత్రులు దొంగతనాన్ని ఎంచుకుని వాహనాల తనిఖీలో పట్టుబడ్డారని చౌటుప్పల్ రూరల్ సిఐ కె. శివరాంరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఎస్‌ఐలు శివకుమార్, దేవేందర్‌రెడ్డిలతో కలిసి నిందితులను విలేఖరుల ఎదుట ప్రదర్శించి మాట్లాడారు. కట్టంగూర్ మండలానికి చెందిన ఉదయ్ తన మిత్రుడైన మహేష్ వద్ద అవసరాల కోసం రూ. 30వేలను అప్పుగా తీసుకోగా అప్పును తీర్చమని మహేష్ ఉదయ్‌కి చెప్పగా అప్పుతీర్చే పరిస్థితిలోలేనని మిత్రుడితో చెప్పాడన్నారు. తనకు డబ్బులు అవసరమున్నవరి అప్పును తీర్చాలని అడగ్గా చేతిలో డబ్బులు లేవని అప్పుతీర్చే మార్గం లేదని చెప్పి తీసుకున్న అప్పును తీర్చుతానని అందుకు తనకు సహాయాన్ని చేయాలని దొంగతనం చేసి అప్పును తీర్చుతానని చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో తిరిగారన్నారు. చివరకు మండలంలోని తాళ్ళవెల్లంల గ్రామంలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఈనెల 14వ తేదీన వడ్డెపల్లి లక్ష్మమ్మ అనే వృద్ధురాలిని తాగేందుకు నీళ్ళవ్వమని డిగ ఇంట్లోకి వెళ్ళి మెడలోని 3.15గ్రాముల బంగారు గొలుసును అపహరించుకు వెళ్ళారన్నారు. వట్టిమర్తి వద్ద గురువారం వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగాఅ చేసిన దొంగతనంను ఒప్పుకున్నారన్నారు. నిందితుల వద్ద నుండి గొలుసును స్వాదీనం చేసుకుని రామన్నపేట న్యాయస్థానంలో ప్రవేశపెట్టనైనదని న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించగా నిందితులను రిమాండ్‌కు తరలించామని సిఐ వివరించారు.